Breaking News

పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వరరాజు సమక్షంలో టీడీపీ,జనసేన కార్యకర్తలు వైసీపీలో చేరిక.

0 56

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నుండి పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వరరాజు సమక్షంలో వైకాపా పార్టీలో చేరారు.

జి.మాడుగుల మండలం భీరం పంచాయితీ లోని తాడేవీధి గ్రామానికి చెందిన వార్డు మెంబర్ సోమెలి ఈశ్వరరావు,9 వ వార్డు సభ్యులు కిల్లుడు మత్యలింగం,మాజీ వార్డు మెంబర్లు సీదరి అప్పలరాజు,రామారావు వారితో పాటు సలమరంగి,సరియా గ్రామాల నుండి టీడీపీ,జనసేన పార్టీ కార్యకర్తలు,మహిళలు సుమారుగా 40 కుటుంబాలు విశ్వేశ్వరరాజు సమక్షంలో పార్టీలో చేరారు.విశ్వేశ్వర రాజు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ..గత టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పరిపాలన ప్రజలకు నచ్చకే వైఎస్సార్ సీపీ లో చేరుతున్నారని అన్నారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా,కులాలకు అతీతంగా,బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మంచి పరిపాలన అందిస్తున్నారని అన్నారు.కనుక రానున్న ఎన్నికల్లో మళ్లీ ప్రజలంతా మరొకసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి గెలిపించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కుడుముల సత్యనారాయణ,మండల పార్టీ అధ్యక్షులు నుర్మనీ మత్యకొండం నాయుడు,మండల యువజన విభాగం అధ్యక్షుడు ప్రశాంత్, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ పాంగి ఆంద్రయ్య,సర్పంచులు కిముడు రాంబాబు,గెమ్మెలి సర్పంచ్ సీదరి రాంబాబు,పెదలోచలి సూపర్ సర్పంచ్ బొడిగి మత్యంనాయుడు,సింగర్బ సూపర్ సర్పంచ్ మసాడి గంగరాజు,కించూరు సర్పంచ్ రాంబాబు,మాజీ సర్పంచ్ తుర్రే కృష్ణమూర్తి,వంతల కృష్ణారావు,సీనియర్ నాయకులు ఎస్. సోమలింగం,లకే రత్నాబాయి,సిరిమా పండన్న,చిన్నబ్బాయి, వెంకటరమణ,బాలన్న,వంజరి శ్రీనివాస్,చిట్టిబాబు,లక్ష్మీనాయుడు,వలసయ్య,గోపాలరావు,బట్టి నారాయణ,పోతురాజు,రమణబాబు,అబ్బాయిదొర,బాలన్న, సోంబాబు,బొంజుబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.