అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం: పాడేరు పట్టణం పాత పాడేరు గ్రామంలో విశ్వేశ్వరరాజు గడప గడపకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు గురించి అడిగి తెలుసుకున్నారు.
పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న జగనన్నకే మా ఓటు అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఎన్నడూ లేని విధంగా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ కావడం దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరుగుతుందని అన్నారు.
రానున్న ఎన్నికల్లో మళ్లీ ప్రజలంతా ఆశీర్వదించి వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని విశ్వేశ్వరరాజు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సీదరి రాంబాబు,జిల్లా కార్యదర్శి సీదరి మంగ్లన్న దొరా,ఏఎంసీ చైర్మన్ కూతంగి సూరిబాబు,కుజ్జెలి సర్పంచ్ గబ్బాడ చిట్టిబాబు,ఎంపీటీసీ దూసురు సన్యాసిరావు,కించురి సర్పంచ్ వంతల రాంబాబు,సీనియర్ నాయకులు కిల్లు కోటి బాబు,కిల్లు ప్రకాష్ నాయుడు,వార్డు సభ్యులు గబలంగి శంకర్ రావు,కార్యకర్తలు జి.భాస్కర్ మహిళలు,తదితరులు పాల్గొన్నారు.