Breaking News

చింతపల్లి:మర్రి కామయ్య 64వ వర్ధంతి వేడుకలు.

0 17

చింతపల్లి:మర్రి కామయ్య 64వ వర్ధంతి వేడుకలు.


 అల్లూరి సీతారామరాజు జిల్లా,చింతపల్లి:

 చింతపల్లి మండల హెడ్ క్వార్టర్ లో మర్రి కామయ్య 64వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ వర్ధంతి కార్యక్రమంలో పాడేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వంతల సుబ్బారావు హాజరై పూల మాల వేసి నివాళులు అర్పించారు. 

 అనంతరం మర్రి కామయ్య ఆదిమజాతి సేవా సంఘం ఉపాధ్యక్షులు చిక్కుడు అశోక్ సభా అధ్యక్షత వహించారు.

 చిక్కుడు అశోక్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుడు మర్రి కామయ్య 64వ వర్ధంతి సందర్భంగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్నికి గిరిజనులు కోరుతున్న అంశాలు

(1) పీవిటజి గిరిజన గ్రామాల్లో త్రాగునీరు, రహదారి సౌకర్యం, ప్రభుత్వ ఇళ్లు లేకుండా స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నారని

(2) పీవిటిజి గ్రామాల పట్ల ప్రత్యక్షంగా ప్రభుత్వం దృష్టి సారించాలని,అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న 22 మండలాల్లో కూడా మర్రి కామయ్య విగ్రహాన్ని ప్రతి మండల హెడ్ క్వార్టర్ ప్రాంగణంలో ప్రభుత్వ లాంఛనాలతో విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు ఉద్యోగ సంఘాల నుండి హాజరు కావడం జరిగింది. మర్రి.గురుమూర్తి, గెమ్మెలి.సింహాద్రి, కొర్ర జగన్, మర్రి చిన్నారావు, మర్రి సత్యనారాయణ, వంతల వెంకటరావు, పాంగి కృష్ణ, వంతల కోటి, పాంగి.చిట్టిబాబు, పాంగి సూర్యారావు, వంతల రవి, వంతల వెంకటరావు వివిధ గ్రామాల నుండి హాజరయ్యారు. ఈ కార్యక్రమం అనంతరం చింతపల్లి మండల ఎంపీడీఓ కి వినతి పత్రాన్ని అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.