Breaking News

మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పై చింతపల్లి ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ మండిపాటు.

0 20

మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పై చింతపల్లి ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ మండిపాటు.

మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు సమస్యలు కనపడలేదా?

-ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ 


అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం: 
మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కి ఏ వంక లేక డొంకట్టుకున్నట్టుంది అని చింతపల్లి ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ అన్నారు. అమ్మా ఈశ్వరి మీకు నిజంగా రాజకీయ అనుభవం ఉందా? ఉంటే గనుక డ్వాక్రా సంఘాల మహిళలు ద్వారా కలెక్టర్ కి ఫిర్యాదు చేయాలి కానీ రోజుకు ఒక వేషం వేసి రోజుకు ఒక పార్టీలో తిరిగే వ్యక్తులతో స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారంటే మీ అనుభవం ఎంతవరకు ఉందో అర్థమవుతుంది అని అన్నారు. ఓకే నేను రాజకీయం చేస్తున్నాను.. డీలర్షిప్ ఎస్ హెచ్ జి గ్రూపు ద్వారా రేషన్ షాపు నడిపిస్తున్నాను. ఈరోజు కొత్తగా వచ్చింది కాదని, ఎప్పటినుండో నేను రేషన్ షాపు నడిపిస్తున్నాను..అది అందరికీ తెలిసిన విషయమే. కానీ అదే టిడిపి పార్టీలో చాలామంది రాజకీయాలు చేస్తూ డీలర్లుగా కొనసాగుతున్నారు. ఎంతమందిని తప్పిస్తారు. మీరు రాజకీయాలు చేయకుండా ఉండే వ్యక్తుల్ని ఎవర్ని పెట్టగలుగుతారు. ఏదో ఒక పార్టీ నుండి ఓటేసి మరీ మహిళలు మాత్రమే ఉన్నారు. మీకు రాజకీయ అనుభవం అనేది ఉంటే ఎలా చేయాలి.. ఎలా మెలగాలో తెలుసుకోండి. ఇలా చేస్తూ ఉంటే చాలామంది మా పార్టీ వైసీపీ నుండి డీలర్లుగా ఎంతమంది ఉన్నారో గానీ టిడిపి నుండి రాజకీయాలు చేస్తున్న వ్యక్తులు చాలామంది ఉన్నారమ్మ ఈశ్వరమ్మ అని అన్నారు. నా ఒక్కదాని వరకే వస్తారా? అందరి మీదకు వస్తారా? మీరు మా నల్లగొండలో సమస్యలు ఉన్నాయి అంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఈ సమస్యలు లేవంటారా? ఆరోజు మీరెందుకు రోడ్లు వేయలేదు? ఎందుకు మంచినీళ్లు ఇవ్వలేకపోయారు? అప్పుడు మీకు ఈ సమస్యలు కనిపించలేదా? లేక అప్పుడు మీకు చేతకాకనా? అని ఏఎంసీ చైర్పర్సన్ జైతిి రాజులమ్మ మండి పడ్డారు. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామంలో వాటర్ ఉంది. మీరు ఏం మాట్లాడుతున్నారో, ఏ గ్రామంలో సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు అర్థం కాని పరిస్థితి అని అన్నారు. ఎండాకాలం నీటి సమస్యలు అనేవి అనుకోకుండా ఏర్పడతాయి. అవి మళ్లీ వెంటనే సరి చేస్తున్నారు. రోడ్డు అంటారా మా వైసిపి గవర్నమెంట్ లోనే మా ఎమ్మెల్యే ద్వారా రోడ్ వేయిస్తానని మీకు సవాల్ చేస్తున్నా. ఓకేనా గిడ్డి ఈశ్వరి.. మీలాగా రోజుకు ఒక మాట మాట్లాడే తత్వం నాది కాదు. నల్లగొండ సమస్యలు ఉన్నాయి ఉన్నాయి అంటున్నారు.ఏమున్నాయి తెలియచేయండి. అంతేగాని ఏళ్ల తరబడి ఏ గ్రామంలో సమస్యలున్నాయి. మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీరు టిడిపి లోకి వెళ్లి పోయిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఏ సమస్యలు లేని గ్రామాలు లేవంటారా? ఉంటే మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోడ్లు ఎందుకు వెయ్యలేదు? కరెంట్ ఎందుకు ఇవ్వలేదు? అడిగేవాళ్ళు లేరు అనుకుంటున్నారా? ఏంటి ఏ ఊర్లో కరెంట్ లేదు. ఎప్పటినుండి లేదు. ఆ గ్రామం ఎప్పటి నుండి ఉంది. ఆ గ్రామం పరిస్థితి ఏంటి? పూర్తిగా తెలుసుకొని మీరు స్టేట్మెంట్లు ఇవ్వండి అని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పై చింతపల్లి ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ మండి పడ్డారు.

Leave A Reply

Your email address will not be published.