Breaking News

ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ కి 100 కోట్లు కేటాయింపు వృధా – సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి.

0 14

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: వైసిపి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కోసం 100 కోట్ల రూపాయలు కేటాయించడం వృధా అని సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి తెలిపారు. కొయ్యూరు మండల కేంద్రంలో పంచాయితీ లెవెల్ సెలెక్షన్ తర్వాత మండల లెవెల్ సెలెక్షన్ టీం లకు ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఆటలు ఆడే అభ్యర్థులకు కేవలం మంచినీటి సదుపాయం తప్పా భోజనం సదుపాయం అరకొర ఏర్పాటు చేయడం కారణంగా చాలామంది ఆకలితో ఆడాల్సిన పరిస్థితి అని అన్నారు. అరకొర సదుపాయాలతో ఆడుదాం ఆంధ్ర నిధులు వృథా చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమమని అర్జున్ రెడ్డి అన్నారు.అన్ని పంచాయితీల నుండి తమ సొంత ఖర్చులతో మండల కేంద్రానికి వచ్చి ఆడడం జరుగుతుందన్నారు. పంచాయితీ, మండల లెవెల్ లో సెలెక్ట్ అయిన వారికి ప్రోత్సాహకంగా ఏమీ లేకపోవడం ఆటగాళ్ళకు నిరుత్సాహం మిగిలిందన్నారు. యూ చీడిపాలెం, మఠం భీమవరం కొయ్యూరు మండల కేంద్రము నుంచి సుమారుగా ఏబై,అరవై కిలోమీటర్ల దూరం నుంచి కూడా మండల లెవెల్ సెలెక్షన్స్ కి రావడం జరిగిందని, రాబోయే ఎన్నికల్లో ఈ 100 కోట్లు దాచుకొని ఎన్నికల్లో ఖర్చు చేయడం కోసమే అని ఎద్దేవా చేశారు.
ఈ ఆడుదాం ఆంధ్ర కేవలం పొలిటికల్ స్టంట్, పొలిటికల్ స్ట్రాటజీ అని, ఆడుదాం ఆంధ్ర ఆటగాళ్ళ తరపున ముక్తకంఠంతో ఖండిస్తున్నాని అర్జున్ రెడ్డి అన్నారు.

Leave A Reply

Your email address will not be published.