Breaking News

హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో నిర్విరామంగా కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు.

0 18

దీర్ఘ కాలిక పేషెంట్ కి వెయ్యి రూపాయలు అందజేత
అల్లూరి జిల్లా,జి మాడుగుల మండలం గడుతూరి పంచాయతీ లోని పచ్చనాపల్లి గ్రామంలో కూడా కోటేశ్వరరావు కి చెందిన ఇల్లు సోమవారం షార్ట్ సర్క్యూట్ కారణంగా మొత్తం కాలిపోవడం జరిగింది. ఇది సామాజిక మాధ్యమాల్లో చూసి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు..దాతల సహకారంతో ఈరోజు 11 వేల రూపాయలు ఆర్థిక సహాయంతో పాటు వంట పాత్రలు,బట్టలు,నిత్యావసర సరుకులు,కూరగాయలు ఇవ్వడం జరిగింది.హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులు టి.మల్లేష్ మాట్లాడుతూ ఇల్లు కాలిపోయి సర్వం కోల్పోయిన కుటుంబాన్ని చూసి చలించి హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు.. దాతలు సహకారం కోరగా వెంటనే దాతలు స్పందించి సహాయం చేశారు. సహాయం అందించిన ప్రతీ ధాతకు మల్లేష్ కృతజ్ఞతలు తెలిపారు.. అనంతరం అదే గ్రామంలో దీర్ఘ కాలిక ఫెషెంట్ ని పరామర్శించి మెడిసిన్ ఖర్చులకు 1000 రూపాయలు నగదు,ఫ్రూట్స్ ని అందజేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధులు గసాడి తిరుపతి బాబు,ఉల్లి లక్ష్మణ్ మాస్టర్,కొఠారి అప్పారావు మాస్టర్,దావీదు,ఉద్యోగ సంఘం నాయకులు కొఠారి సోమయ్య మాస్టర్,మాతే సింహాచలం (ఎఫ్ ఎస్ ఓ),గడుతూరు పంచాయతీ వైస్ సర్పంచ్ కోమటి చిన్నయ్య,మాజీ ఎంపీటీసీ మాతే అప్పారావు,వీఆర్పీ కోమటి కళ్యాణ్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.