Breaking News

అంతాడ సచివాలయంలో అట్టహాసంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం.

0 18

*అంతాడ సచివాలయంలో అట్టహాసంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం.
*కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ.

అల్లూరి సీతారామరాజు కొయ్యూరు,మండలం: మండలంలోని అంతాడ సచివాలయంలో స్థానిక సర్పంచ్ సుర్ల చంద్రరావు అధ్యక్షతన మంగళవారం అట్టహాసంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతపల్లి ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 3000 రూపాయలు చేస్తానని ఇచ్చి మాట నిలబెట్టుకోవడం జరిగిందని,ప్రజలకోసం అనేక సంక్షేమ పథకాలు పెట్టి మంచి చేయడం జరుగుతుందని తెలిపారు.

ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు అనేక రకాలుగా మంచి చేస్తున్న వైయస్సార్ సీపీ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలంతా పూర్తి మద్దతు ఇవ్వాలని,ప్రజలంతా ఆశీర్వదించి మరొకసారి గెలిపించాలని కోరారు.అనంతరం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో చింతపల్లి ఏఎంసీ డైరెక్టర్ అచ్యుత్,జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రీమల గంగాధర్, వార్డు మెంబర్లు,సచివాలయ సిబ్బంది,వాలంటీర్లు,ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.