ఎమ్మెల్యే,జడ్పీ చైర్ పర్సన్ హాజరైన అల్లూరి శత వర్ధంతి కార్యక్రమానికి రిపోర్టర్ ని ఆహ్వానించి అవమానపరిచిన వైసీపీ జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్.
అల్లూరి సీతారామరాజు శత వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసిన మీడియా ప్రతినిధిని అవమానించిన వైసీపీ జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్.
పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి,ఉమ్మడి విశాఖ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర హాజరైన అల్లూరి సీతారామరాజు శత వర్ధంతి వేడుకలు సందర్భంగా విలేకరులను ఆహ్వానించి అవమాన పరిచిన వైసీపీ నాయకుడు జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ గాడి అచ్చిరాజు.
గాడి అచ్చిరాజు(జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్) |
ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం లోని రాజేంద్ర పాలెం,మంప వద్ద జరిగిన అల్లూరి సీతారామరాజు శత వర్ధంతి వేడుకలు సందర్భంగా ముఖ్య అతిథిలుగా పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి, ఉమ్మడి విశాఖ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని న్యూస్ కవర్ చేసేందుకు విలేకరులను ఆహ్వానించడం జరిగింది.
ఈ నేపథ్యంలో రాజేంద్ర పాలెం వద్ద జరిగిన కార్యక్రమం అనంతరం మంప గ్రామంలో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసే సందర్భంలో స్వయంగా ఎమ్మెల్యే,జడ్పీ చైర్ పర్సన్, కొయ్యూరు మండల వైసీపీ పార్టీ నాయకులు ఉండగా కార్యక్రమానికి ఆహ్వానం మేరకు విచ్చేసిన ఒక కొయ్యూరు మండల రిపోర్టర్ ని అవమానించడం జరిగింది.
కొయ్యూరు మండలం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం అయినప్పటికీ.. మండలంలో మాత్రం గిరిజనేతరుల హవా కొనసాగుతోంది.
ఓట్ మెజారిటీ ఎక్కువగా గిరిజనులకు ఉన్నప్పటికీ గిరిజనేతరులు ప్రతీ విషయానికీ కల్పించుకొని మరీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది.
మంప లో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఎమ్మెల్యే, జడ్పీ చైర్ పర్సన్ పూలమాల వేస్తుండగా వీడియోలు తీయడానికి వెళ్లిన రిపోర్టర్ ని కావాలనే ఉద్దేశంతో వైసీపీ జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ అవమానించడం జరిగింది.
కేవలం అవమానింపబడిన కొయ్యూరు మండల రిపోర్టర్ ఒక గిరిజనుడు అనే నెపంతోనే గిరిజనేతరుడైన జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ అచ్చిరాజు కావాలనే అవమానించడం జరిగిందా?లేక వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది.. తమకు ఎవరేంచేస్తారు అనే ఉద్దేశంతో అవమానించడం జరిగిందా? లేక ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి తమకు సపోర్ట్ గా ఉన్నారనే నెపంతో రిపోర్టర్ ని అవమానించడం జరిగిందా అనే విషయం మాత్రం తెలియడం లేదు.
నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండి, మండల నాయకులు అక్కడే ఉండి కూడా ఎవరూ ఖండించకపోవడం గమనార్హం.
ఏది ఏమైనప్పటికీ ఒక రాజకీయ పార్టీ అయినా,రాజకీయ పార్టీ నేతలకు అయినా మీడియా అవసరం చాలా ఉంటుంది.
అలాగే ఒక రాజకీయ పార్టీ కి సోషల్ మీడియా ప్రతినిధులు కూడా అంతే అవసరం.
అలాంటిది మీడియా ప్రతినిధులను ఒక జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ ఇలా అవమానిస్తూ ప్రవర్తించడం వల్ల భవిష్యత్తులో పార్టీకి ఎంతవరకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.
పార్టీ ఎంతవరకు బలపడుతుంది?