Breaking News

జీ.కే వీధి మండలంలో విశ్వేశ్వరరాజు పర్యటన.

0 44

అల్లూరి సీతారామరాజు జిల్లా,పాడేరు నియోజకవర్గం: గూడెం కొత్తవీధి మండల ముఖ్య నాయకులతో పాడేరు నియోజకవర్గం సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వరరాజు సోమవారం సమావేశమయ్యారు.
నూతనంగా పాడేరు నియోజకవర్గ ఇంచార్జ్ గా నియమితులై మొట్టమొదటి సారి జి.కే.వీధి మండలానికి విచ్చేసిన సందర్భంగా మండల నాయకులు విశ్వేశ్వర రాజు కి ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా మండల కేంద్రంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.విశ్వేశ్వర రాజు నాయకులతో మాట్లాడుతూ దేశంలో సామాజిక న్యాయం కోసం డా”బి.ఆర్ అంబేద్కర్ ఉద్యమించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం అంబేద్కర్ నుండి జగన్ మోహన్ రెడ్డి దేశ సిద్ధాంతాలు నుంచి స్ఫూర్తి పొంది ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనారిటీలకు ప్రాధాన్యం ఇస్తూ ముఖ్యమంత్రి సమ్మెళిత పాలన సాగిస్తున్నారని అన్నారు. జీ.కే వీధి మండల నాయకులు,కార్యకర్తలు, అభిమానులు అందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కే సాధ్యం అయ్యిందని అన్నారు.రాబోయే ఎన్నికల్లో ఈ మండలం నుండి ఎమ్మెల్యే అభ్యర్థికి పార్లమెంట్ అభ్యర్థికి మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు బొబ్బిలి లక్ష్మణ్,మండల సర్పంచులు పోరం అధ్యక్షులు కుందేరి రామకృష్ణ, అరకు పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్,చింతపల్లి జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య,మాజీ జెడ్పీటీసీ మచ్చెల మత్స్యరాజు,మాజీ ఎంపీపీ వంతల బాబురావు,వైస్ ఎంపీపీ లు సప్పగడ్డ ఆనంద్,లోత దేముడు,స్ధానిక సర్పంచ్ కొర్ర సుభద్ర,స్థానిక ఎంపీటీసీ పసుపులేటి నాగమణి,కొయ్యూరు మండల పీఎసీఎస్ చైర్మన్ సూరిబాబు,డౌనురు ఎంపీటీసీ బిడిజన అప్పారావు, జీ,కే వీధి మండలం 16 పంచాయితీల సర్పంచులు,ఎంపీటీసీలు,వైస్ సర్పంచులు వివిధ నామినేటెడ్ పదవుల్లో ఉన్న నాయకులు పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.