Breaking News

రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం కుటుంబ ఆత్మీయ బహిరంగ సభ.

0 429


అల్లూరి సీతారామరాజు జిల్లా,పాడేరు: వాల్మీకి కులస్థుల కుటుంబ ఆత్మీయ బహిరంగ సభ ఆదివారం పాడేరు లో జరిగింది.ఈ సభకు పాడేరు నియోజకవర్గం లోని ఐదు మండలాల నుండి వాల్మీకి కులస్థులు హాజరయ్యారు.ఈ సమావేశంలో వైకాపా రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మోరి రవి పోటీకి సిద్ధపడుతున్న నేపథ్యంలో పలువురు రవి రాజకీయ అంశాలను గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ సమావేశంలో రవి మాట్లాడుతూ వైకాపా పార్టీలో మండల పార్టీ అధ్యక్షులుగా ఉంటూ ఇద్దరు ఎమ్మెల్యేల గెలుపుకు కీలకంగా వ్యవహరించడం జరిగిందని,కానీ అప్పటినుండి ఇప్పటివరకు చింతపల్లి వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు గానే కొనసాగటం జరుగుతుందని రాజకీయంగా ఇప్పటివరకు సముచిత స్థానం దక్కలేదని మాట్లాడటం జరిగింది.ఈ క్రమంలోనే ఆయన వైకాపా పార్టీ రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి సిద్ధపడుతున్నట్లు తెలిపారు.ఈ క్రమంలో ఈ సమావేశానికి హాజరైన వారు రవికి సామాజికంగా,ఆర్థికంగా,రాజకీయంగా అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తామని తెలిపారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని గానే విధేయుడుగానే ఉంటూ మండల స్థాయి నుండి,గ్రామస్థాయి వరకూ అన్ని వర్గాల నాయకులను,కార్యకర్తలను కలిసి మాట్లాడేందుకు కుటుంబ సభ్యులు,సీనియర్ నాయకులు,సన్నిహితులుతో చర్చలు జరుగుతున్నట్లు రవి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.