Breaking News

మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ని విమర్శించే హక్కు ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ కి లేదు.-టీడీపీ పార్టీ నేతలు.

0 18

 మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ని విమర్శించే హక్కు ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ కి లేదు.

కొయ్యూరు మండల టీడీపీ పార్టీ నేతలు.

 (అల్లూరి సీతారామరాజు జిల్లా,పాడేరు నియోజకవర్గం, కొయ్యూరు మండలం):

కొయ్యూరు మండల తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి తోట దొరబాబు మాట్లాడుతూ..

చింతపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జైతి రాజులమ్మ పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కి రాజకీయ అవగాహన లేదు అంటూ విమర్శలు చేస్తున్నారు.

అమ్మ రాజులమ్మ అసలు మీకు రాజకీయ అవగాహన ఉందా? కొయ్యూరు మండలం నల్లగొండ పంచాయతీలో పలు సమస్యల మీద స్పందనలో ఆ గ్రామస్తులతో కలిసి ఫిర్యాదు చేసుకుంటే మీకు ఎందుకమ్మా బాధ.

అసలు మీకు ఉందా రాజకీయ అవగాహన. అధికార పార్టీలో ఉండి రోడ్డు మేమే వేయిస్తాము అంటూ సవాల్ చేస్తున్నారు. మా మీద ఎందుకమ్మా మీకు సవాళ్లు. మీ ఊరికి వెళ్లే రోడ్డు శంకుస్థాపన చేసి మూడు సంవత్సరాలు గడుస్తుంది. ఇప్పటికీ వేయలేదు.మాకు ఎందుకమ్మా మీ సవాళ్లు. మహా అయితే ఒక్క ఎనిమిది నెలల్లో మీ గవర్నమెంట్ పోతుంది.ఈ మాత్రం దానికి మాకు సవాల్ అవసరమా.మీరు డీలర్ల కోసం మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్లు కూడా డీలర్లుగా చేస్తున్నారు అని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్లు డీలర్లుగా మీలాగా అధికార పదవులు అనుభవిస్తూ ఎవ్వరూ డీలర్లుగా చేయడం లేదు. వాళ్ళు డీలర్లుగా చేయడం వేరు.. ఒక అధికార పార్టీలో పదవిని అనుభవిస్తూ డీలర్గా చేయడం వేరు. గతంలో ఎప్పటినుంచో మీరు డీలర్ గా చేస్తున్నారు. రాజకీయం చేస్తున్నారు. కానీ మీ గ్రామంలో మీ మీద ఎవరైనా ఇప్పటి వరకు ఫిర్యాదు చేశారా? మీరు కొద్దిగా రాజకీయ అవగాహన తెలుసుకొని మాట్లాడండి. గిడ్డి ఈశ్వరి కోసం మాట్లాడే స్థాయి మీది కాదమ్మా అని అన్నారు.గిడ్డి ఈశ్వరికి విమర్శించే హక్కు రాజులమ్మకు లేదు అని తెలిపారు.

నల్లగొండ రోడ్డుకి శంకుస్థాపన చేసి మూడు సంవత్సరాలు గడిచింది.

ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసి ఏమి అభివృద్ధి చేశావు.

పార్టీలో ఉన్నతమైన పదవి చేస్తూ డీలర్ పదవి ఎలా చేస్తారు అని ప్రశ్నించారు.

నల్లగొండ,రావణాపల్లి యూనిట్ ఇంచార్జ్ లోతా సింహాచలం మాట్లాడుతూ..

జైతి రాజులమ్మ మమ్మల్ని రోజుకొక వేసం వేసుకునే వాళ్ళు అంటూ విమర్శిస్తున్నారు. అమ్మ రాజులమ్మ మీరు ఎన్ని వేషాలు మార్చి ఈరోజు మీరు ఈ స్థాయికి వచ్చారు మీకు తెలియదా. కమ్యూనిస్టు పార్టీలో గొడ్డేటి దేవుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి పనిచేశారు.

తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు మాజీ మంత్రి బాలరాజు తో కలిసి పనిచేశారు. ఇప్పుడు వైసిపి పార్టీ కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి తో కలిసి తిరుగుతున్నారు. ఎన్ని పార్టీల్లో ఇన్ని వేషాలు మార్చిన మీరు మమ్మల్ని విమర్శించడం తగదు.

ఇన్ని పార్టీలు మారి ఇంతమంది ఎమ్మెల్యేలతో కలిసి నల్లగొండ పంచాయతీని ఏం అభివృద్ధి చేశారో చెప్పండి.మీరు అధికారంలో ఉన్న నాలుగు సంవత్సరాలలో ఒక్క ఇల్లు అయినా మన పంచాయితీలో కట్టించారా.

ఇన్ని పార్టీలు మారి మీరు పదవులు తెచ్చుకున్నారు తప్ప ఈ గ్రామానికి చేసింది ఏమీ లేదని నల్లగొండ పంచాయతీ డ్వాక్రా మహిళలతో కలిసి సమావేశంలో మాట్లాడడం జరిగింది. చింతపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ని డీలర్గా తప్పించి ఇక్కడ ఉన్న డ్వాక్రా గ్రూపుల్లో వేరే వాళ్ళకి డీలర్గా నియమించాలని డిమాండ్ చేయడం జరిగింది.నల్లగొండలో డ్వాక్రా మహిళలతో తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన తెలపడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కొయ్యూరు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి తోట దొరబాబు,

యూనిట్ ఇంచార్జ్ లోతా సింహాచలం,పల్లి అప్పారావు,డ్వాక్రా మహిళలు

కోనేపు అచ్చియ్యమ్మ,జంపా నాగమణి,జంపా రాజేశ్వరి,పల్లి కళ్యాణి,కొనకం గంగాయ్యమ్మ,రొబ్బా లక్ష్మి,వాకపల్లి రాజేశ్వరి,జంపా సుబ్బయ్యమ్మ,సాల్పిరెడ్డి కన్నయ్యమ్మ,బచ్చలి సన్యాసమ్మ,పొట్టిక రాజులమ్మ,కాకర నూకరత్నం,కొనేపు రమణి మహిళలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.