Breaking News

రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మోరి రవి?

0 825

అల్లూరి సీతారామరాజు జిల్లా,చింతపల్లి మండలం: వైసీపీ పార్టీలో చింతపల్లి మండల పార్టీ అధ్యక్షుడు మోరి రవి పార్టీ ఆవిర్భావం నుండి సీనియర్ నాయకుడుగా ఉంటూ గతంలో ఎమ్మెల్యే గా గెలిచిన గిడ్డి ఈశ్వరి,ప్రస్తుత ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి గెలుపుకు కీలకంగా వ్యవహరించారు.ఈ క్రమంలో అప్పటి నుండి ఇప్పటి వరకు మండల పార్టీ అధ్యక్షుడు గానే ఉన్నాను కానీ ఇంతకు మించి సముచిత స్థానం దక్కలేదని ఆయన అన్నారు.ఎప్పుడూ పార్టీ కి విధేయుడునే గానీ తాను వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.అలాగే అరకు పార్లమెంట్ పరిధిలో పార్టీ టికెట్ విషయంలో వాల్మీకి కులస్థులకు మొండి చేయి చూపించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కనుకనే ప్రస్తుతం కుటుంబ సభ్యులతో,బంధు మిత్రులతో సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పారు.పాడేరు నియోజకవర్గ ‘రెబల్’ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దిగుతున్నట్లు ఆయన తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.