Breaking News

డీఈఓ కి,ఎంఈఓ కి కృతజ్ఞతలు తెలిపిన చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం కొయ్యూరు మండల కన్వీనర్ అచ్యుత్.

0 16

(అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం): మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పాఠశాలలకు అందాల్సిన బియ్యం ఏమైనట్టు?. అక్టోబర్ నెలలో మూడు పాఠశాలలకు,గత డిసెంబర్ నెలలో ఏడు పాఠశాల లకు బియ్యం అందని వైనం.పాఠశాల లకు బియ్యం ఇవ్వకపోవడానికి గల కారణం ఏమిటి? లోపం ఎవరిది? అనే శీర్షికన వచ్చిన కథనం ద్వారా ఈ సమస్యను డిఇఓ కి,కొయ్యూరు ఎంఈఓ కి చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం కొయ్యూరు మండల కన్వీనర్ అచ్యుత్ తెలియజేయడం జరిగింది.ఈ సమస్యను వెనువెంటనే పరిష్కారం చేసేందుకు డీఈఓ చర్యలు తీసుకున్నారు.కనుక సమస్యను తెలియజేసిన వెంటనే పరిష్కరిస్తున్న డీఈఓ కి చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం కొయ్యూరు మండల కన్వీనర్ అచ్యుత్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కొమ్మిక స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న కొప్పుకొండ,బొర్రంపేట,కొత్త తుమ్మలబంధ, కర్ణికపాలెం,డేగలపాలెం,తాళ్ళపాలెం, గంగవరం అను ఈ ఏడు ఎలిమెంటరీ పాఠశాలలకు పిల్లలకు అందాల్సిన మధ్యాహ్న భోజన పథకం లో భాగంగా టీచర్స్ రైస్ కోసం అలాట్మెంట్ పెట్టినప్పటికీ గత డిసెంబర్ నెలలో సివిల్ సప్లై వారు బియ్యం ఇవ్వలేదు.
అలాగే ఆడాకుల పంచాయితీ లోని ఆడాకుల,కిష్టారం,జీ.కే.గూడెం పాఠశాలలకు అక్టోబర్ నెలలో కూడా బియ్యం ఇవ్వలేదు.అలాగే వీటిలో కొన్ని పాఠశాలలకు టీచర్స్ అలాట్మెంట్ పెట్టినంత రైస్ ఇవ్వకుండా సగం రైస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ సమస్యను డీఈవో పరిగణలోకి తీసుకొని కొయ్యూరు ఎంఈఓ రాంబాబు ద్వారా పూర్తి విషయం తెలుసుకొని పాఠశాలలకు అందాల్సిన బియ్యం కచ్చితంగా అందాలని ఆదేశాలు ఇచ్చారు.దీంతో ఈరోజు కృష్ణాదేవిపేట లో ఎంఈఓ రాంబాబు జీసీసీ మేనేజర్ ని, సూపరింటెండెంట్ ని కలిసి పూర్తి విషయాలు మాట్లాడి పాఠశాల లకు అందాల్సిన బియ్యం త్వరితగతిన అందేలా చర్యలు తీసుకున్నారు.ఏఏ పాఠశాల లకు ఎంత బియ్యం ఇవ్వాలో పరిశీలించి పంపిణీ చేస్తామని జీసీసీ మేనేజర్,సూపరింటెండెంట్ తెలిపారు.కనుక ఈ సమస్యను పరిగణలోకి తీసుకొని వెనువెంటనే స్పందించి పరిష్కరిస్తున్న డీఈఓ కి,కొయ్యూరు ఎంఈఓ కి చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం కొయ్యూరు మండల కన్వీనర్ అచ్యుత్ కృతజ్ఞతలు తెలిపారు. ముందు ముందు బాలల హక్కులకు వారి పరిరక్షణకు సంబంధించి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని అధికారులను అచ్యుత్ కోరారు.

Leave A Reply

Your email address will not be published.