Breaking News

మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పాఠశాలలకు అందాల్సిన బియ్యం ఏమైనట్టు?

0 38

*మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పాఠశాలలకు అందాల్సిన బియ్యం ఏమైనట్టు?
*అక్టోబర్ నెలలో మూడు పాఠశాలలకు,గత డిసెంబర్ నెలలో ఏడు పాఠశాల లకు బియ్యం అందని వైనం.
*పాఠశాల లకు బియ్యం ఇవ్వకపోవడానికి గల కారణం ఏమిటి? లోపం ఎవరిది?
(అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండల): కొమ్మిక స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న కొప్పుకొండ,బొర్రంపేట,కొత్త తుమ్మలబంధ, కర్ణికపాలెం,డేగలపాలెం,తాళ్ళపాలెం,గంగవరం అను ఈ ఏడు ఎంపీపీ పాఠశాలలకు పిల్లలకు అందాల్సిన మధ్యాహ్న భోజన పథకం లో భాగంగా టీచర్స్ రైస్ కోసం అలాట్మెంట్ పెట్టినప్పటికీ గత డిసెంబర్ నెలలో సివిల్ సప్లై వారు బియ్యం ఇవ్వలేదు.అలాగే కొన్ని పాఠశాలకు అలాట్మెంట్ పెడుతున్నప్పటికీ బియ్యం సగమే ఇస్తున్నట్లు టీచర్స్ చెబుతున్నారు.
బియ్యం సరిపడా ఇవ్వకపోవడంతో అవి సరిపోక వేరే చోట నుండి కొన్ని సార్లు అప్పు తీసుకొచ్చి పిల్లలకు భోజనం వండించి పెడుతున్నట్లు తెలిపారు.ఇందులో ముఖ్యమైన అంశం ఏమిటంటే అలాట్మెంట్ పెట్టినంత రైస్ ఇవ్వకపోగా సగం రైస్ మాత్రమే ఇచ్చి, టీచర్స్ తో థంబ్ వేయించగా టీచర్స్ అలాట్మెంట్ ఎంత అయితే పెడుతున్నారో సివిల్ సప్లై వారు తీసుకువచ్చిన మిషన్ లో అంతే బియ్యం తీసుకున్నట్లు చూపిస్తుంది.అలాగే ఆడాకుల పంచాయితీ లోని ఆడాకుల,కిష్టారం,జీ.కే.గూడెం పాఠశాలలకు అక్టోబర్ నెలలో కూడా బియ్యం ఇవ్వలేదు.అలాగే పోయిన డిసెంబర్ నెలలో ఆడాకుల స్కూల్ అలాట్మెంట్ 83 కేజీలు,కిష్టారం స్కూల్ 110 కేజీలు,జీ.కే.గూడెం 10 కేజీలు పెడితే..ఈ మూడు పాఠశాలలకు కలిపి మొత్తం 70 కేజీలు బియ్యం ఇవ్వడం జరిగింది.ఈ 70 కేజీల బియ్యంలో ఆడాకుల స్కూల్ 83కేజీలు పెడితే 31 కేజీలు,కిష్టారం స్కూల్ 110 కేజీలు పెడితే 30 కేజీలు,జీకే గూడెం 10కేజీలు పెడితే 10 కేజీలు తీసుకున్నారు.అలాగే ఆర్ కొత్తూరు,మాడుగుల ఈ రెండు పాఠశాల లకు డిసెంబర్ నెలలో కేవలం ఎనిమిది కేజీల బియ్యం రావడం జరిగింది.అయితే తీసుకున్న బియ్యం తక్కువే కానీ టీచర్స్ థంబ్ వేసాక వాళ్ళు ఎంత అలాట్మెంట్ పెడుతున్నారో మిషన్ లో అంతా చూపిస్తుంది.
అయితే రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటే..విద్యతో పాటు విద్యార్థులకు అందాల్సిన మధ్యాహ్న భోజనాలకు సంబంధించిన బియ్యం మాత్రం పాఠశాల లకు అందడం లేదు.పాఠశాల లను పర్యవేక్షణ చేసి విద్యార్థులకు విద్యతో పాటు అందాల్సిన మధ్యాహ్న భోజనం కూడా సక్రమంగా అందుతుందా? లేదా? లేక ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకొనే అధికారులు కొయ్యూరు మండలంలో కరువయ్యారు.
ఇదిలా ఉండగా పాఠశాల లకు అందాల్సిన బియ్యం పాఠశాల లకు ఇవ్వకపోతే ఆ బియ్యం ఏమైనట్టు.

Leave A Reply

Your email address will not be published.