Breaking News

కొయ్యూరు మండల కేంద్రంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు.ముఖ్య అతిథిగా హాజరైన ఎంవివి

0 109

*మండల కేంద్రంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు.
*ముగ్గుల పోటీలు,పలు సాంస్కృతిక కార్యక్రమాలు.
-సర్పంచ్ పీటా సింహాచలం,వైస్ ఎంపీపీ నూకాలమ్మ.

అల్లూరి జిల్లా కొయ్యూరు మండల కేంద్రం రాజేంద్రపాలెం పంచాయతీలో సర్పంచ్ పీటా సింహాచలం,బషీర్ ఖాన్, వైస్ ఎంపీపీ అంబటి నూకాలమ్మ ఆధ్వర్యంలో మిరియాల రాజు,ముప్పవరపు శివాజీ ఆర్థిక సాయంతో ముగ్గుల పోటీలు,పలు సాంస్కృతిక నృత్యాలు నిర్వహించిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎంవివి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రధమ,ద్వితీయ,తృతీయ బహుమతులు అందజేశారు.నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించడం పట్ల పలువురు స్థానికులు హర్షం తెలియజేస్తున్నారు.ఈ కార్యక్రమంలో ఎంవివి ప్రసాద్ మాట్లాడుతూ ఈ 2024 నూతన సంవత్సరం మీ జీవితంలోకి సరి కొత్త సంతోషాలు తీసుకురావాలని ప్రతిక్షణం మీరు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అనిశెట్టి చిరంజీవి పలువురు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.