Breaking News

పిల్ల పచ్చ కాకులు ఎంత అరిచినా ప్రయోజనం లేదు-ఏఎంసీ చైర్ పర్సన్

0 17

 పిల్ల పచ్చ కాకులు ఎంత అరిచినా ప్రయోజనం లేదు-ఏఎంసీ చైర్ పర్సన్

గిడ్డి ఈశ్వరి గురించి ఎంతో ఊహించుకున్నాను..అంత పస లేదని అర్థం అయింది.

పిల్ల పచ్చకాకులకు నేను సమాధానం చెప్పడం ఏంటని వెటకారంగా సమాధానం.

(అల్లూరి సీతారామరాజు జిల్లా):కొయ్యూరు మండల టీడీపీ పార్టీ నేతలకు ఒక్కటే ప్రశ్న.ఈరోజు గిడ్డి ఈశ్వరి కి సపోర్ట్ చేస్తూ స్టేట్మెంట్ ఇస్తున్నారు బాగానే ఉంది.టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎంవీవీ ప్రసాద్ అనే వ్యక్తి లేకపోతే కొయ్యూరు మండలంలో అసలు మీరెవరు?ఆనాడు తన స్వలాభం కోసం పార్టీ మారిన గిడ్డి ఈశ్వరి కి,ఎంవివి ప్రసాద్ వల్ల మీరెవరో కొంతమందికి తెలుసు అతనిని వదిలేసి గిడ్డి ఈశ్వరి వెనుక తిరుగుతున్న మీకు తేడా ఏం లేదని ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ అన్నారు.అయినా నమ్మిన వారికి వెన్నుపోటు పొడవటం మీ పార్టీ వాళ్ళకి కొత్తేం కాదని వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు.మీకు ఏమైనా సిగ్గు, నిజాయితీ అనేది ఉంటే ఎంవివి ప్రసాద్ తో తిరగండి.ఎంతోకొంత పార్టీ అయినా బలోపేతం అవుతుందని అన్నారు.నా గురించి మొదట స్టేట్ మెంట్ ఇచ్చిన గిడ్డి ఈశ్వరి ముందుకు రాకుండా పిల్ల బచ్చా గాల్లకి,పిల్ల పచ్చ కాకులకు ఉసి గొలుపుతున్నారంటే రాజకీయ అనుభవం ఎంతుందో తెలుస్తుందని అన్నారు.ఇన్నాళ్ళు గిడ్డి ఈశ్వరి గురించి ఎంతో ఊహించుకున్నానని, గిడ్డి ఈశ్వరి కి అంత పస లేదని వెటకారంగా సమాధానం చెప్పారు.ఇలాంటి పిల్ల పచ్చ కాకులకు నేను సమాధానం చెప్పడం ఏంటని సున్నితంగా తిరస్కరించారు.మా ఊళ్ళో ఒక బాతు బచ్చాగాడు ఉన్నాడని, టీడీపీ లో చేరకముందు వేరే పార్టీ నేతలతో కలిసి ఆ పార్టీ నాయకుడిగా స్టేట్మెంట్ ఇచ్చుకునే వాడని, ఇప్పుడు తాను టీడీపీ నాయకుడిని అంటూ తిరుగుతున్నాడని.. అలాంటి సోదిగాడు కూడా ఈరోజు నా గురించి స్టేట్మెంట్ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.టీడీపీ పార్టీలో మొదటి నుండి కష్టపడి పని చేసి, పార్టీ ని కాపాడిన సీనియర్ నాయకులను వదిలేసి వాళ్ళ సపోర్ట్ లేకుండా మీరు ఎలా గెలుస్తారని ఏఎంసీ చైర్ పర్సన్ అన్నారు. పిల్ల పచ్చకాకులకు, పిల్ల బచ్చాగాళ్లకు, సోది గాల్లకు నేను సమాధానం చెప్పడం ఏంటని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.