అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో పర్యావరణం పరిరక్షణ, జీవనవిధానం పై అవగాహన.
ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం లోని నల్లగొండ పంచాయితీ గ్రామంలో అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో పర్యావరణం పరిరక్షణ జీవన విధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ.. నల్లగొండ పరిధిలో అటవీ సంపద ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదేనని, అలాగే ప్లాస్టిక్ వాడకం వల్ల అనేక అనర్ధాలు జరుగుతాయని, గ్రామాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించాలని తద్వారా మానవాళి జీవన విధానం మెరుగవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో చింతపల్లి మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ,కృష్ణాదేవిపేట రేంజ్ అధికారి వెంకటరావు,వీఆర్ఓ రాజేష్, , సెక్షన్ ఆఫీసర్ లక్ష్మణ్,అటవీశాఖ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.