Breaking News

హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో మన ఆరోగ్యం..మన చేతుల్లోనే కార్యక్రమం.

గ్రామస్తులకు దుస్తులు,వాలీబాల్ నెట్ పంపిణీ.

0 43

హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో మన ఆరోగ్యం..మన చేతుల్లోనే కార్యక్రమం.*

*గ్రామస్తులకు దుస్తులు,వాలీబాల్ నెట్ పంపిణీ.


అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: ఈరోజు హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం డౌనూరు పంచాయతీ లోని రొబ్బసింగి గ్రామంలో మన ఆరోగ్యం.. మన చేతుల్లో అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఆరోగ్యం పట్ల గ్రామస్తులకు అవగాహన పరచడం జరిగింది.చిన్న పిల్లలకు పసర మందులు పట్టకూడదని,నాటు వైద్యం కరెక్ట్ కాదని,వేడి చేసిన నీళ్లు త్రాగాలని, దోమ తెరలు వాడాలని తెలియజేయడం జరిగింది.కార్యక్రమం అనంతరం దాతలు ఇచ్చిన దుస్తులను గ్రామస్తులకు ఇవ్వటం జరిగింది.అలాగే గ్రామ యువతకు వాలీబాల్,నెట్ ఇవ్వటం జరిగింది.ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు టి.మల్లేష్,హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధులు తిరుపతి బాబు,లక్ష్మణ్ అలాగే గ్రామ పెద్దలు చిట్టిబాబు,నాగేశ్వరావు గ్రామ మహిళలు,యువత పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.