Breaking News

ఆపదలో ఉన్నవారికి కొండంత అండగా నిలిచిన అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, శివప్రసాద్ దంపతులు.

0 18

 ఆపదలో ఉన్న వారికి అర్ధరాత్రి వేళ కొండంత అండగా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి,శివప్రసాద్ దంపతులు.

వివరాల్లోకి వెళితే అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం, వెలగల పాలెం గ్రామానికి చెందిన వాడపల్లి సొమ్ములమ్మ ( 68) నిన్న శనివారం మధ్యాహ్నం జీడిమామిడి తోటకు పనికి వెళ్లి వస్తున్న సందర్భంలో ద్విచక్ర వాహనం నుండి క్రిందపడి తలకు బలమైన గాయం అవడంతో హుటాహుటిన విశాఖపట్నం లోని కేజీహెచ్ హాస్పిటల్ కి తీసుకు వచ్చిన వెంటనే ఆమె తుది శ్వాస విడిచారు.ఈ విషయం తెలిసిన వెంటనే అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి.. ఆమె భర్త శివ ప్రసాద్ ని కేజీహెచ్ హాస్పిటల్ వద్దకు పంపించి దగ్గరుండి   హాస్పిటల్ యంత్రాంగంతో, పోలీస్  శాఖ వారితో నిన్న రాత్రి నుండి పలుమార్లు మాట్లాడి అంబులెన్స్ వాహనం  ఏర్పాటు చేయించి పార్థివ దేహాన్ని దగ్గరుండి వాహనంలో ఎక్కించి స్వగ్రామానికి పంపించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మనోధైర్యం  కల్పించి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.