*కరెంట్ షాక్ తగిలి మూడు పశువులు మృతి.
*అడవి పందుల కోసం పెట్టిన కరెంట్ సప్లై వల్ల షాక్ తగిలి మూడు పశువులు మృత్యువాత.
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం లోని కిష్టారం గ్రామంలో కరెంట్ షాక్ తగిలి బొడారపు చిన్నబ్బాయి అనే వ్యక్తి కి చెందిన మూడు పశువులు జంపా ఎర్రయ్య అనే వ్యక్తి కి చెందిన జీడి మామిడి తోటలో మృతి చెందాయి.
కరెంట్ సప్లై పెట్టిన వ్యక్తులు ఎవరు అనే పూర్తి విషయాలు ఇంకా తెలిసి రాలేదు.
ఆస్తి నష్టం 60,000 ఉంటుందని తెలిపిన పశువుల యజమాని బొడారపు చిన్నబ్బాయి.
విషయం తెలుసుకున్న వెంటనే ఎంక్వైరీ మొదలు పెట్టిన కొయ్యూరు పోలీసులు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.