Breaking News

పాడేరు నూతన సబ్ కలెక్టర్ ధాత్రిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన గిడ్డి ఈశ్వరి

0 51

అల్లూరి జిల్లా పాడేరు: పాడేరు నూతన సబ్ కలెక్టర్ గా దాత్రి రెడ్డి బుధవారం ఉదయం 10 గంటలకు సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా పాడేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా ఆమెతో మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో మీ సేవలు ఎంతో అవసరమని గిరిజన ప్రజలకు మంచి సేవలు అందించే విధంగా మీరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వహణ కార్యదర్శి కోడా వెంకట సురేష్ కుమార్,నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు డప్పోడి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.