Breaking News

మోదకొండమ్మ అమ్మవారి జాతరకు వెయ్యిమంది పోలీసులు.

0 21

మోదకొండమ్మ అమ్మవారి జాతరకు వెయ్యిమంది పోలీసులు.

ఎటువంటి అలజడలు,అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు, ప్రత్యేక నిఘా ఏర్పాటు.

శ్రీ శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మవారి పండుగ ఈనెల 14 నుండి 16 వరకు జరుగుతుంది. దీనికిగాను ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ సుమారు వెయ్యిమంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది.

 ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్స్ వంతడాపల్లి,ఆడారిమెట్ట,ఎండిఓ ఆఫీస్, సెంటెన్స్ స్కూల్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది.

కల్చరల్ ప్రోగ్రామ్స్ స్టేజీలు,అమ్మవారి గుడి,అంబేద్కర్ జంక్షన్, ఆర్ టి సి కాంప్లెక్స్ ముఖ్యమైన కూడలి వద్ద ప్రజల భద్రతా నిమిత్తం బిడి టీమ్స్, డాగ్ స్క్వాడ్స్ తో చెక్ చేయించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.

పిక్ పాకెట్, చైన్ స్నాచింగ్, బైకు దొంగతనాలు జరగకుండా నివారించుటకు పది క్రైమ్ పార్టీలను ఏర్పాటు చేసి 24 గంటలు నిఘా ఉండే విధముగా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

ఆడపిల్లలకు ఈవిటీజింగ్ జరగకుండా చూసేందుకు షీ టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది.

భక్తులకు చిన్న పిల్లలు తప్పిపోయిన ఎడల వారికి సహాయం చేయుటకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి టెంపుల్ వద్ద పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సీసీ కెమెరా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం ద్వారా మొదటి రోజు 14వ తేదీన మధ్యాహ్నం తప్పిపోయిన ఒక చిన్న పాపను సీసీ కెమెరా ద్వారా గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. చోరీకి గురైన రెండు బైకులను క్రైమ్ టీం పట్టుకొని వాహన యజమానులకు అప్పగించడం జరిగింది. ఈ సీసీ కెమెరాల ద్వారా అనుమానితులపై నిఘా ఉంచి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడం జరుగుతుంది.

 ఈ అమ్మవారి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన షూట్ బాల్, స్కిల్ గేమ్స్, జూదంను ముందస్తు సమాచారం మేరకు పోలీసు వారు వాటిని నివారించడం జరిగింది.

క్రైమ్ పార్టీలను ఏర్పాటు చేయడం ద్వారా ఈ పండుగలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడం జరిగిందని ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.