Breaking News

క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ‘ఆడుదాం ఆంధ్ర’: చింతపల్లి ఏఎంసీ చైర్ పర్సన్

0 54

అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలం: క్రీడాకారులలో ఉన్న ప్రతిభను వెలికి తీసి ప్రోత్సహించడమే లక్ష్యంగా’ఆడుదాం ఆంధ్ర’అనే ప్రోగ్రామ్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో కండక్ట్ చేయడం జరిగిందని… వాలీబాల్, కబడ్డీ,క్రికెట్,షటిల్ వంటి తదితర గేమ్స్ ఆడించడం జరుగుతుందని చింతపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జైతి రాజులమ్మ అన్నారు. ఈనెల 26 నుండి ఫిబ్రవరి 10 వరకు ‘ఆడుదాం ఆంధ్ర’ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుందని, కనుక యువత,క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ అన్నారు.ఇటువంటి గేమ్స్ వల్ల క్రీడాకారుల్లో మానసిక ఉల్లాసం, ఉత్సాహం కలుగుతుందని ఆమె అన్నారు.గెలిచిన టీం లు గ్రామస్థాయి నుండి మొదలుకొని మండల స్థాయి, డివిజనల్, జిల్లా ఇలా రాష్ట్ర స్థాయిలో ఈ గేమ్స్ ఆడించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం లోని రావణాపల్లి సచివాలయంలో ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ,మండల తాహశీల్దార్ తిరుమలరావు,రావణాపల్లి,నల్లగొండ సర్పంచులు కాకురు లక్ష్మి,జంపా రాజకుమారి చేతులు మీదుగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రావణాపల్లి పంచాయితీ కార్యదర్శి రజని,నల్లగొండ పంచాయితీ కార్యదర్శి సత్యగౌరి, వీఆర్వో లక్ష్మి,సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు,యువత,క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.