అల్లూరి సీతారామరాజు జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి మొదలుకొని నియోజకవర్గ స్థాయి వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఆడుదాం ఆంధ్ర పోస్టర్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ శతక బుల్లిబాబు క్యాంప్ కార్యాలయంలో విడుదల చేసారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా…ఏ పాలకులూ నిర్వహించని విధంగా వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవతో,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతీయువకులలో దాగివున్న క్రీడా ప్రతిభను వెలికి తీయాలనే సదుద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం రేపటి నుండి ప్రారంభం కానుంది.దీని కోసం ఇప్పటికే దాదాపుగా రాష్ట్రంలో ఉన్న 15 లక్షల మంది యువత రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.వారందరూ ఈ ఆటల్లో పాల్గొని కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ శతక బుల్లిబాబు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో స్థానిక సచివాలయం సిబ్బంది,చైర్మన్ బృందం సభ్యులు పాల్గొన్నారు.