Breaking News

జగనన్న జన్మదిన వేడుకలు సందర్భంగా అవ్వా తాతలకు రగ్గులు పంపిణీ చేసిన జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గంగాధర్.

0 27

(అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలం): అంతాడ పంచాయితీ కొత్తపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రీమల గంగాధర్ అవ్వా తాతలతో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు.

జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రీమల గంగాధర్, స్థానిక సర్పంచ్ చంద్రరావు చేతుల మీదుగా కేక్ కటింగ్ చేయడం జరిగింది.గంగాధర్ మాట్లాడుతూ.. తన మిత్రుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌస్ ఆలోచనతో ఆయన సహాయంతో చలికాలం దృష్టిలో పెట్టుకొని జగనన్న జన్మదిన వేడుకలు సందర్భంగా అవ్వా తాతలకు సుమారు 50 మందికి రగ్గులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ పాంగి సత్యవతి,పాంగి పోతురాజు వైయస్సార్ పార్టీ నాయకులు సరమండ అగ్గి రాముడు,వాలంటీర్లు పాంగి కన్నబాబు,అల్లంపల్లి కనకమహాలక్ష్మి,కొర్రు వీర్రాజు,కొత్తపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.