Breaking News

ఘనంగా గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ జన్మదిన వేడుకలు.

0 102

*ఘనంగా గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ జన్మదిన వేడుకలు.

*గణిత ఉపాధ్యాయులను సన్మానించిన తోటి ఉపాధ్యాయులు.

(అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం):కొయ్యూరు మండలం లోని పి.మాకవరం బాలికల ఆశ్రమ పాఠశాలలో గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా శుక్రవారం నిర్వహించారు.ముందుగా పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న గణిత ఉపాధ్యాయులు.. ప్రధానోపాధ్యాయులు అయిన దేవేశ్వరరావు, మరో గణిత ఉపాధ్యాయురాలు కుమారి భానుప్రియ లను తోటి ఉపాధ్యాయులు అందరూ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవేశ్వరరావు గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ గురించి విపులంగా విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో గణితానికి సంబంధించిన ఉపన్యాసాలు,నృత్య ప్రదర్శనలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులతో పాటు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.