గత నెలలో ఎంపీపీ పాఠశాలకు రేషన్ బియ్యం ఇవ్వని రేషన్ డీలర్ అని వచ్చిన వార్తకు ఎండీయు వివరణ.
బియ్యం ఇచ్చేందుకు వెళ్ళగా ఆయా లేరు.. స్కూల్ లో టీచర్ కూడా లేరని చెప్పిన ఎండీయు.
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం:ఆడాకుల పంచాయితీ లోని బి.కొత్తూరు గ్రామంలో ఉన్న ఎంపీపీ పాఠశాలకు సంబంధించి పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా అందాల్సిన బియ్యం గత నవంబర్ నెలలో ఆ పాఠశాలకు ఇవ్వలేదని ఆయా చెప్పడం జరిగింది.అయితే దీనికి సంబంధించి వార్త రావడంతో ఆ పరిధిలో రైస్ సప్లై చేసే ఎండియు(మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్) రాజుబాబు స్పందించి వివరణ ఇచ్చారు.రైస్ ఇచ్చేందుకు ఆ గ్రామానికి రెండు సార్లు వెళ్ళడం జరిగిందని,ఆయా ను థంబ్ వేయించి రైస్ ఇద్దామనుకుంటే రెండు సార్లు కూడా ఆమె గ్రామంలో లేరని చెప్పారు.
ఆయా లేకపోయేసరికి బియ్యం వచ్చిన విషయం చెప్పేందుకు టీచర్ వద్దకు వెళితే టీచర్ ఎప్పుడూ స్కూల్ కి వచ్చేవారు కారని,ఇప్పటి వరకూ టీచర్ ని కూడా చూడలేదని అన్నారు. అందుకే బి.కొత్తూరు ఎంపీపీ పాఠశాలకు గత నెలలో బియ్యం ఇవ్వడం కుదరలేదని వివరణ ఇచ్చారు.అయితే బి.కొత్తూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యా విధానం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.