Breaking News

620 కోట్లతో 4,34,185 మంది విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌తో ట్యాబ్‌లు పంపిణి చేసిన సీఎం జగన్.

0 554

*రూ.620 కోట్లతో 4,34,185 మంది విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌తో ట్యాబ్‌లు పంపిణి చేసిన సీఎం జగన్.

*మన పిల్లలు ప్రపంచంలోనే దిబెస్ట్‌గా ఉండాలనేదే నా ఆకాంక్ష: సీఎం జగన్

*రూ. 17,500 ట్యాబ్ లలో, 15,500 విలవైన బైజూస్ కంటెంట్ వేసి ఇస్తున్నాం, దీంతో ప్రతి విద్యార్ధికి రూ. 33,000 లబ్ది.

*ట్యాబ్‌లలో చదువుకు సంబంధించిన అంశాలే ఉంటాయి.. తల్లిదండ్రులకు ఎలాంటి భయాలు అవసరం లేదు.

*జగన్ అప్పులు చేస్తున్నాడని చెబుతునే 6 గ్యారెంటీల పేరుతో జగన్ ఇచ్చేదానికన్నా మూడువంతులు ఎక్కవ ఇస్తామంటున్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా,చింతపల్లి మండలం: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఎనిమిదో తరగతి విద్యార్థులకు వరుసగా రెండో ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్స్‌ పంపిణీ చేపట్టింది. పేదింటి పిల్లలు అంతర్జాతీయ వేదికపై తమ సత్తాచాటాలన్న సీఎం జగన్ లక్ష్యం మేరకు రూ.620 కోట్ల వ్యయంతో బైజూస్‌ ప్రీలోడెడ్‌ కంటెంట్‌ గల 4,34,185 ట్యాబ్స్‌ను 9,424 పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి నుంచి సీఎం జగన్ ట్యాబ్‌ల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు..

“మన పిల్లలు ప్రపంచంలోనే దిబెస్ట్‌గా ఉండాలనేదే నా ఆకాంక్ష. పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే. విద్యార్థులకు మంచి చేస్తుంటే విష ప్రచారం చేస్తున్నారు. విద్యార్థులకు చెడు చేస్తున్నామంటూ తప్పుడు రాతలు రాశారు. పేద విద్యార్థులపై విషం కక్కొద్దని చెబుతున్నా. దిగజారుడు రాతలు రాయొద్దని చెబుతున్నా. పేద పిల్లల చేతిలో ట్యాబ్‌లు ఉంటే చెడిపోతారంట. పేద విద్యార్థులు ఇంగ్లీష్‌ మీడియంలో చదవద్దా?. పేద పిల్లలు ఇంగ్లీష్‌ మీడియం చదవితే తెలుగు అంతరించుకుపోతుందట. పేదలకు మంచి చేస్తుంటే మీకెందుకు ఈ కడుపుమంట. పేదల పిల్లలకు మంచిచేస్తుంటే కొందరు ఏడుస్తున్నారు. ఇటువంటి దిక్కుమాలిన రాజకీయాలతో యుద్ధం చేస్తున్నాం” అంటూ సీఎం జగన్‌ ధ్వజమెత్తారు. గిట్టని వాళ్లు జగన్‌ దుబారా చేస్తున్నాడంటూ మాట్లాడుతున్నారని, దేశంలో ఏ ప్రభుత్వం కూడా పేదలకు ఈ స్థాయిలో ఖర్చుచేయలేదని ఖర్చు చేసే ప్రతీ రూపాయి భావితరాల కోసమే అని సీఎం పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటిలో ఉన్న పిల్లలంతా వీరే మన భవిష్యతని, వీరంతా మన వెలుగులని, వీరంతా మన తరువాత కూడా మన రాష్ట్ర భవిష్యత్‌ నిలిపే మన వారసులని సీఎం జగన్ అన్నారు. వీరి భవిష్యత్‌ గురించి ఆలోచించి, మన రాష్ట్రంలో ఉన్న పిల్లలు పోటీ ప్రపంచంతో గెలవాలని ఈ 55 నెలలు ప్రతి అడుగు కూడా ఒక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే దిశగా అడుగులు పడ్డాయని సీఎం జగన్ తెలిపారు.
అందులో భాగంగానే వరుసగా రెండో ఏడాది ఈ రోజు ప్రభుత్వ బడుల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 10 రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే ప్రతి మండలాన్ని సందర్శించేలా ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇచ్చే మంచి కార్యక్రమం ఇదని అన్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే 8వ తరగతి విద్యార్థులకు రూ.620 కోట్లు ఖర్చు చేస్తూ ఈ రోజు ట్యాబ్‌లు ఇస్తున్నామని, డిజిటల్‌ విప్లవంలో భాగంగానే గత ఏడాది కూడా నా పుట్టిన రోజున రూ.686 కోట్లతో 5.15 లక్షల ట్యాబ్‌లను పిల్లలకు, చదువులుకు చెబుతున్న టీచర్లకు పంపిణీ చేశామని చెప్పారు. పిల్లలకు అవసరమైన బైజూస్‌ కంటెంట్‌ను ఆఫ్‌లైన్‌ సైట్‌లో పని చేసేలా అప్‌లోడ్‌ చేసి ఇస్తున్నామని, ప్రతి పిల్లాడికి పాఠాలు సులభంగా అర్థమయ్యేలా ఈ ట్యాబ్‌లు ఉపయోగపడుతున్నాయని స్పష్టం చేశారు.

“ఈ ట్యాబ్‌లు రిపేరైతే మీ హెచ్‌ఎంకు ఇవ్వండి, లేదా గ్రామ సచివాలయాల్లో ఇవ్వండి..వాళ్లు రసీదు ఇస్తారు. వారం రోజుల్లోనే మీకు రిపేరీ చేసి ఇస్తారు. అలా కాకపోతే ఇంకో ట్యాబ్‌ ఇస్తారు. సెక్యూర్‌ మెబైల్‌ డివైజ్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారా ఏం జరుగుతుందంటే..పిల్లాలు పాఠాలు, లెర్నింగ్‌కు సంబంధించిన అంశాలు మాత్రమే చూడగలుగుతారు. పిల్లలు ఏం చూస్తున్నారన్నది ఈ సాప్ట్‌వేర్‌ ద్వారా తెలుస్తుంది. వీటి పట్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఈ ట్యాబ్‌లు మంచి చేసే ఒక ఇంధనంగా ఉంటుంది” అని సీఎం జగన్ పేర్కొన్నారు.

*రూ. 17,500 ట్యాబ్ లలో, 15,500 విలవైన బైజూస్ కంటెంట్ వేసి ఇస్తున్నాం, దీంతో ప్రతి విద్యార్ధికి రూ. 33,000 లబ్ది*

ఈ ట్యాబ్‌ మార్కెట్‌ విలువ రూ.17,500 ఉంటుందని, దీనికి తోడు బైజూస్‌ కంటెంట్‌ శ్రీమంతులు కొనుగోలు చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే రూ.15 వేలు చెల్లించాల్సి ఉంటుందని, ఈ కంటెంట్‌ను ఉచితంగా ట్యాబ్‌లో డౌన్‌లోడ్‌ చేసి ట్యాబ్‌లు ఇస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ఈ ట్యాబ్‌ విలువ అక్షరాల రూ.33 వేలు అని విద్యార్ధికి రూ.33వేల లబ్ది చేకూరుతుందని అన్నారు.

“ఈ పిల్లలందరిని కూడా ఇంత ఖర్చు చేసి వారి చేతుల్లో ఎందుకు పెడుతున్నామంటే కారణం.. నా పిల్లలు దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలవాలని వాళ్ల మేనమామగా చేస్తున్నాను” అని సీఎం జగన్ అన్నారు

జగన్ ఆప్పులు చేస్తున్నాడని చెబుతున్నారు.. మళ్లీ ఆరు గ్యారెంటీ పేర్లతో మేనీపేస్టో అంటారు.. అందలో కూడా జగన్ ఇచ్చేదానికన్నా మూడువంతులు ఎక్కవ ఇస్తామని చెబుతున్నారు. ప్రజలు దయచేసి మోసపోవద్దని కోరుతున్నా:. సీఎం జగన్

ప్రతి స్కూల్‌లో కూడా 6వ తరగతి నుంచి పైబడిన ప్రతి క్లాస్‌ రూమ్‌ను కూడా డిజిటలైజేషన్‌ చేసే దిశగా అడుగులు పడుతున్నాయని, నాడు–నేడు పూర్తి చేసుకున్న 6 నుంచి 12వ తరగతి వరకు ప్రతి క్లాస్‌ రూమ్‌లో ఇంటారాక్ట్‌ ప్లాట్‌ ప్లానల్స్‌ ఏర్పాటు చేయడం జరుగుతుందని సీఎం తెలిపారు. ఇప్పటికే నాడు–నేడు మొదటి ఫేజ్‌ పూర్తి చేసుకున్న 15వేల స్కూళ్లలో ఇప్పటికే 30,213 క్లాస్‌ రూమ్‌ల్లో ఐఎఫ్‌పీ పెట్టామని, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇంగ్లీష్‌ ల్యాబ్‌లు తీసుకువచ్చామని, స్మార్ట్‌ టీవీలు ఏర్పాటు చేశామని, ఇందుకోసం రూ.420 కోట్లు ఖర్చు చేశామని సీఎం వివరించారు.

నాడు–నేడు 2వ దఫా పనులు వేగంగా జరుగుతున్నాయని, మరో 31,834 క్లాస్‌ రూములను డిజిటలైజేషన్‌ చేస్తామని, పూర్తిగా 62,097 క్లాస్‌ రూములు జనవరి 30వ తేదీ కల్లా పూర్తి అవుతుందని తెలిపారు. ప్రతి పాఠశాలకు ఐఎఫ్‌పీలు బిగించడమే కాకుండా అన్నింటిలో కూడా ఎస్‌డీ కార్డులు, ఆండ్రాయిడ్‌ బాక్స్‌లు, ఐఎఫ్‌పీ ప్యానల్‌ ఉన్న చోట బైజూస్‌ కంటెంట్‌ అప్‌లోడ్‌ చేయిస్తున్నాం. క్లాస్‌ రూమ్‌ల్లోనే బైజూస్‌ పాఠాలు ఉంటాయని, పిల్లలకు కన్ఫూజన్‌ లేకుండా అవే పాఠాలు చెబుతారని, ట్యాబ్‌లో అదే కంటెంట్‌ ఉంటుందని, ఇది పిల్లలకు పూర్తిగా ఉపయోగపడుతుందని సీఎం పేర్కొన్నారు.

*ట్యాబ్‌లలో చదువుకు సంబంధించిన అంశాలే ఉంటాయి.. తల్లిదండ్రులకు ఎలాంటి భయాలు అవసరం లేదు*

“ఈ ట్యాబ్‌ పాఠాల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్‌లో డౌట్లు వస్తే ఎవరు చెబుతారన్న సందేహం ఉంటుంది. అందుకే ఈ సారి పిల్లలకు ఇచ్చే ఐ ప్యాడ్లో ఒక యాప్‌ అప్‌లోడ్‌ చేయించాం. ఇందులో డౌట్‌ క్లియరెన్స్‌ యాప్‌ ఉంటుంది. దీన్ని వాడుకుని పిల్లలకు ఏ డౌట్‌ ఉన్నా కూడా క్లియర్‌ అవుతుంది. ఇంత ధ్యాస పెట్టి పిల్లలు ఏం చదువుతున్నారు. ఎలా చదువుతున్నారు. ట్యాబ్లో ఏమున్నాయి. వాటిని ఇంకా సులభతరం చేయాలని ఆలోచన చేస్తూ..మీ పిల్లల గురించి తాపత్రయపడే వాళ్ల మేనమామ ప్రభుత్వం ఇక్కడ ఉంది అని చెప్పడానికి సంతోషపడుతున్నా.. రాబోయే రోజుల్లో పిల్లలు ఇంకా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇతర విదేశీ భాషలు నేర్చుకునేలా డూయేలింగ్‌ యాప్‌ అప్‌లోడ్‌ చేయిస్తున్నాం. ఈ ట్యాబ్‌లు నిరంతరం పిల్లలకు తోడుగా ఉండే ట్యూటర్‌గా అండగా నిలబడుతుంది. వారి ప్రయాణంలో అన్ని రకాలుగా పిల్లలకు సహకారం అందుతుంది” అని సీఎం వివరించారు.

“పిల్లలందరూ కూడా ఏపీలో బెస్ట్‌గా ఉండాలని కాదు.. ప్రపంచంలోనే బెస్ట్‌గా ఉండాలని నేను చూస్తున్నాను. దాని కోసం ప్రాధమిక స్థాయి నుంచే అంటే 3వ తరగతి నుంచి పిల్లలను సిద్ధం చేసేలా అమెరికాకు చెందిన టోఫెల్‌ ఈటీఎస్‌తో ఒప్పందం చేసుకున్నాం. ఈ రోజు టోఫెల్‌ను ఒక పిరియడ్‌గా కేటాయిస్తూ తర్ఫీదు ఇచ్చేలా 3వ తరగతి నుంచి మొదలుపెడుతున్నాం. ఆలోచన చేయమని అడుగుతున్నాను ” అని సీఎం అన్నారు

ఇంతగా తపన పడుతున్న మనందరి ప్రభుత్వంపై, మంచి చేస్తున్న ప్రభుత్వంపై కొందరు బురద జల్లుతున్నారని సీఎం ధ్వజమెత్తారు. పేదవాడు పేదవాడిగా మిగిలిపోకూడదని మీ జగన్‌ ఆరాటపడుతున్నాడని అన్నారు. దురుద్దేశంతో ఎలాంటి కుట్రలు చేస్తున్నారని ప్రజలు గమనించాలని కోరారు.

“పేద పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తుంటే ..ఇవ్వకూడదట. ట్యాబ్‌లు చేతిలో ఉంటే పిల్లలు చెడిపోతారట.పిల్లలు చెడిపోతున్నారని ప్రతి రోజు పని గట్టుకొని నా పై విమర్శలు చేస్తున్నారు. ఆ పత్రిక యాజమాన్యాన్ని, ఆపత్రికను సమర్ధించే రాజకీయ నాయకులను ఒక్కటే అడుగుతున్నాను. ఇంత దిగజారి రాతలు రాయకండి అని అందరికి చెబుతున్నాను. పేదవర్గాల పిల్లల మీద ఇంతగా విషం కక్కకండి అని చెబుతున్నాను. పేద పిల్లలకు మంచి జరుగుతుంటే ఇంత కడుపు మంట వద్దని చెబుతున్నాను” అని సీఎం జగన్ హితవు పలికారు.

*జగన్ అప్పులు చేస్తున్నాడని చెబుతునే 6 గ్యారెంటీల పేరుతో జగన్ ఇచ్చేదానికన్నా మూడువంతులు ఎక్కవ ఇస్తామంటునని మోసం చేస్తున్నారు*

నిన్న ఇదే పచ్చ మీడియా అంతా కూడా ఒకవైపు జగన్‌కు పది తలకాయలు చూపించారని, రాష్ట్రమంతా అప్పులపాలైందని రాస్తారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పి ఆరు గ్యారంటీలు చెబితే పాతక శీర్షికలో రాస్తారని ఎద్దేవా చేశారు. వారి ఇచ్చేవి చూస్తే జగన్‌ ఇచ్చేదానికన్నా వారు చెప్పేది మూడింతలుందని, ఎంత మోసం చేస్తున్నారో ప్రజలు ఆలోచన చేయాలని సీఎం జగన్ కోరారు.. గతంలో 2014లో వాళ్లే అధికారంలో ఉన్నారని, ఆ రోజు రూ.87వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని మోసం చేశారని,. పొదుపు సంఘాల మహిళలను మోసం చేశారని ఇంటింటికి జాబ్‌ ఇస్తామన్నారని, జాబ్‌ ఇవ్వకపోతే రూ.2 వేల నిరుద్యోగ భృతి అన్నారని ఒక్కరికి కూడా ఇవ్వలేదని సీఎం గుర్తు చేశారు. ఇంతదారుణంగా అడ్డగోలుగా 2014 నుంచి 2019 దాకా అందర్ని మోసం చేశారని సీఎం మండిపడ్డారు. చివరికి టీడీపీ మేనిఫెస్టో ను వెబ్‌సైట్‌ నుంచి తీసేశారని, ప్రజలు కొడతారని భయపడి నెట్‌లో లేకుండా చేశారని విమర్శించారు.

కానీ, మీ బిడ్డ పరిపాలనలో మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతలా భావించి 99 శాతం హామీలు నెరవేర్చి మీ ముందుకు వచ్చానని సీఎం ఉద్ఘాటించారు. నేరుగా బటన్‌ నొక్కి రూ.2.40 లక్షల కోట్లు నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశానని, ఎక్కడా లంచాలు లేవని, ఎక్కడా వివక్ష లేదని, మీ బిడ్డ ఇలా బటన్‌ ఎలా నొక్కగలుగుతున్నాడని ప్రశ్నించారు. నేరుగా డబ్బులు ఎలా జమ చేశారో గమనించాలని, గత పాలకులు ఇలా ఎందుకు చేయలేకపోయారో ఆలోచన చేయాలని ప్రజలను సీఎం కోరారు.
అప్పుల్లో పెరుగుదలలో కూడా అప్పటి కంటే ఇప్పుడు చాలా తక్కువ. మరి మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతున్నాడు. చంద్రబాబు ఎందుకు చేయలేదో ఆలోచన చేయండి

Leave A Reply

Your email address will not be published.