రాజేంద్రపాలెం లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి.
రాజేంద్రపాలెం లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి.
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం లోని రాజేంద్ర పాలెం వద్ద గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్థానిక వైస్ ఎంపీపీ అంబటి నూకాలమ్మ తో, వైసీపీ పార్టీ మండల నాయకులతో కలిసి ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి ని టీడీపీ పార్టీ కి చెందిన స్థానిక సర్పంచ్ పీటా సింహాచలం సాదర స్వాగతం పలికారు.
ఈరోజు 243 గడప లను ఎమ్మెల్యే సందర్శించి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకుంటూ.. పథకాల గురించి వివరించారు.
పలుచోట్ల ప్రజలు తమ గ్రామంలో సిసి రోడ్లు వేయించి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేని కోరారు.
ఆ సమస్యలు కచ్చితంగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
టిడిపి పార్టీకి చెందిన స్థానిక సర్పంచ్ పీటా సింహాచలం ఎమ్మెల్యేతో కలిసి ప్రతి గడపను సందర్శిస్తూనే.. పంచాయతీలో ఉన్న పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి ఆ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరారు.
ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలతో మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధే జగనన్న లక్ష్యమని, ప్రజలకు మంచి చేసే దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తూ ముందుకు వెళుతుందని కనుక రానున్న రోజుల్లో మళ్ళీ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని ఎమ్మెల్యే కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ బడుగు రమేష్, వైసీపీ పార్టీ మండల అధ్యక్షుడు జల్లి బాబులు, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు ముసిలి నాయుడు, మండల మహిళా అధ్యక్షురాలు సావిత్రి,నర్సి కృష్ణ,చీడిపాలెం సర్పంచ్ సోమన్న దొర,పి.మాకవరం ఎంపీటీసీ మల్లీశ్వరి, ఎమ్మార్వో తిరుమలరావు, ఎంపీడీఓ మేరీరోజ్,కండగోకిరి సచివాలయ కన్వీనర్ పాటి శేఖర్,అంతాడ సచివాలయ కన్వీనర్ రీమల గంగాధర్, బూధరాళ్ళ సచివాలయ కన్వీనర్ తిరుపతి,రాజేంద్ర పాలెం సచివాలయ కన్వీనర్ చిన్నారావు,లాలం శేఖర్, నరసింహ,రాజుబాబు,గోకిరి చిన్నారావు, మరికొంతమంది మండల నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.