Breaking News

విశాఖపట్నం:పర్యటనకు వచ్చిన చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసిన గిడ్డి ఈశ్వరి.

0 19

 విశాఖపట్నం పర్యటనకు వచ్చిన చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసిన గిడ్డి ఈశ్వరి.

నియోజకవర్గంలోని వివిధ సమస్యలపై చర్చ.


తెలుగుదేశం పార్టీ అధినేత జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, విశాఖపట్నంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమ పర్యటనకు వచ్చిన చంద్రబాబు నాయుడు తో గురువారం పాడేరు నియోజకవర్గ పరిశీలకులు రాజమండ్రి నారాయణతో కలిసి మర్యాదపూర్వకంగా చంద్రబాబు నాయుడుని కలిసిన పాడేరు నియోజకవర్గం ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి. ఈ సందర్భంగా చంద్రబాబుతో ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో నెలకొన్న వివిధ సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా జీవో నెంబర్ 3, బోయ వాల్మీకులను బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చే విషయంలో అలాగే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణాలపై నియోజకవర్గంలో వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చంద్రబాబుతో చర్చించినట్లు ఆమె తెలిపారు. అలాగే పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని పూర్వ వైభవం తీసుకొచ్చారని చంద్రబాబు నాయుడు అన్నారన్నారు. కార్యకర్తలంతా ఏకదాటిగా పార్టీ బలోపేతానికి కృషిచేసి అత్యధిక మెజారిటీతో పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ గెలుపునకు నిరంతరం కష్టపడి పనిచేసి పాడేరు నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.