Breaking News

వరుసగా రెండోసారి లోతుగెడ్డ ఆశ్రమ పాఠశాల విద్యార్థికి జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి.

0 37

అల్లూరి సీతారామరాజు జిల్లా,చింతపల్లి మండలం: గతేడాది పాడేరులో జరిగిన జిల్లాస్థాయి కౌషల్ సైన్స్ కాంపిటీషన్లో లోతుగెడ్డ విద్యార్థి ఆర్.మనోజ్ కుమార్ జిల్లాస్థాయిలో ప్రథమ స్థానం గెలుపొంది రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం గెలుపొందడం జరిగింది. మరల ఈ సంవత్సరం(20-12-2023)కూడా లోతుగడ్డ ఆశ్రమ పాఠశాల విద్యార్థి జి.అకిరా రిషిత్ కుమార్ జిల్లాస్థాయి కౌశల్ సైన్స్ కాంపిటీషన్ పోస్టర్ ప్రజెంటేషన్(పర్యావరణహిత జీవన విధానం)లో ప్రథమ స్థానం గెలుపొందడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు ఎస్వి రమణ తెలిపారు.
కార్యక్రమంలో విద్యార్థికి షీల్డ్,సర్టిఫికెట్,మూడు వేల రూపాయల నగదు బహుమతి ఇవ్వటం జరిగింది. ఈ సందర్బంగా లోతుగెడ్డ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్వీ రమణ,సీనియర్ ఉపాధ్యాయులు ఎల్. యేసురత్నం,వార్డెన్ ఎస్.బాలకృష్ణ,ఉపాధ్యాయులు
ప్రథమ బహుమతి గెలుపొందిన విద్యార్థి రిషిత్ కుమార్ ను,గైడ్ టీచర్ చల్లంగి.ప్రకాష్ ను అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.