Breaking News

తుఫాను కారణంగా మా పంట పాడైంది.అధికారులారా గుర్తించండి.

0 195

*మేము మనుషులమే మమ్మల్ని గుర్తించండి.

*తుఫాను కారణంగా మా పంట పాడైంది.అధికారులారా గుర్తించండి.

*స్పందించని అధికారుల తీరుకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సర్పంచ్.

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: మండలంలోని అంతాడ పంచాయితీలోని పారికేలు,టెంకలపనుకు మరికొన్ని ఘాటీ పైనున్న గ్రామాల్లో ఈమధ్య మిచౌంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టం జరిగిన రైతులను అగ్రికల్చర్ అధికారులు గానీ, రెవెన్యూ అధికారులు గానీ పంట నష్టాన్ని అంచనా వేయలేదని,కనీసం మా గ్రామాలను కూడా ఎవరూ సందర్శించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేము మనుషులమే మమ్మల్ని కూడా గుర్తించండి సారూ అంటూ అధికారులను కోరుతున్నారు.ఈ విషయంపై స్థానిక సర్పంచ్ చంద్రరావు స్పందిస్తూ రెండు వారాల క్రితం సంబంధిత అధికారులకు కూడా తెలియజేశానని అయినా ఇప్పటివరకు ఎవరూ స్పందించలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.పంట నష్టాన్ని గుర్తించడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారో తెలియడం లేదన్నారు.

Leave A Reply

Your email address will not be published.