Breaking News

గిరిజనుల స్థితిగతులను మార్చేది వైసీపీ ప్రభుత్వం మాత్రమే -పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి.

0 19

 గిరిజనుల స్థితిగతులను మార్చేది వైసీపీ ప్రభుత్వం మాత్రమే

-పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి.

అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం:

గిరిజనుల‌ స్థితిగతులను మార్చేది కేవలం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మాత్రమేనని పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి  అన్నారు. సిఫార్సులు లేకుండా సంక్షేమ ఫలాలను అందించిన ఏకైక ప్రభుత్వం తమదేనని సంక్షేమ పాల‌న‌ను అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇప్పటి వరకు చూడలేదని ఆమె అన్నారు. కొయ్యూరు మండలం యు.చీడిపాలెం గ్రామ సచివాలయం పరిధిలోని సంగంవలస, నక్కలమెట్ట, గంగవరం, యు.చీడిపాలెం గ్రామాలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా 189 గడపలను సందర్శించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. అర్హత ఉండి కూడా ప్రభుత్వ పథకాలు రాని వివరాలను సేకరించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చాలావరకు డ్రైనేజీ , సిసి రోడ్ల‌ నిర్మాణానికి సంబంధించినటువంటి సమస్యలను ప్రజలు వివరించారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గిరిజనుల ఆర్థిక పురాభివృద్ధే లక్ష్యంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ఇంతకుముందు ఎప్పుడు సంక్షేమ పథకాలు పొందనటువంటి పేదలు ఈరోజు సంక్షేమ పథకాల రూపంలో ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారని అన్నారు. వివిధ పథకాల రూపంలో ఆర్థిక సాయం పొందుతూ వారి పురోభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. విద్యా విధానంలో విప్ల‌వం తీసుకొచ్చిందని ప్రతి పేదవాడికి కార్పొరేట్ విద్య అందించాలని లక్ష్యంతో జగనన్న ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ప్రతి కుటుంబంలో సంక్షేమ పథకాలు లబ్ది పొందుతున్నామని వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రి గా గెలిపించుకుంటామని ప్రజలే చెబుతుండ‌డం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దడాల రమేష్, ఎంపీటీసీ టీ.మాధవరావు, మండల పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు, ఎంపీపీ బడుగు రమేష్, ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ, వైస్ ఎంపీపీలు అప్పన వెంకటరమణ, అంబటి నూకాలమ్మ,ఎంపిటిసి సడ్డా మల్లేశ్వరి, సీనియర్ నాయకులు సావిత్రి, గురుమూర్తి, సొన్ను,  రీమెల గంగాధర్,పాటి శేఖర్, అంతిరెడ్డి శ్రీనివాస్, కే వెంకట్రావు, కే కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.