Breaking News

కొమ్మిక సచివాలయంలో ‘ఏపీ కి జగనే ఎందుకు కావాలి’ కార్యక్రమం

0 86

*కొమ్మిక సచివాలయంలో ‘ఏపీ కి జగనే ఎందుకు కావాలి’ కార్యక్రమం.

*సచివాలయం పరిధిలో సంక్షేమ, అభివృద్ధి పథకాల రూపంలో ప్రజలకు అందిన లబ్ధి 23కోట్ల రూపాయలు.

*కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీపీ బడుగు రమేష్,మండల పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు,జేసీఎస్ కన్వీనర్ బండి సుధాకర్.

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: మండలం లోని కొమ్మిక సచివాలయంలో ఈరోజు ‘ఏపీ కి జగనే ఎందుకు కావాలి’ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ బడుగు రమేష్, మండల పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు,జేసీఎస్ కన్వీనర్ బండి సుధాకర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంపీపీ, మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాల రూపంలో ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో కొమ్మిక సచివాలయం పరిధిలో ప్రభుత్వం తరుపున 23కోట్ల రూపాయలు లబ్ధి అందించడం జరిగిందన్నారు.గతంలో కేవలం మాటల ప్రభుత్వం ఉండేదని,ఇది మాట ఇచ్చి నిలబెట్టుకుంటున్న ప్రజా ప్రభుత్వమని అన్నారు.ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని అన్నారు.కులం గానీ,మతం గానీ,ప్రాంతం గానీ,పార్టీ అనే తారతమ్యం లేకుండా అర్హత మాత్రమే కొలమానంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని తెలిపారు.ప్రజలకు ఇన్ని రకాలుగా మంచి చేస్తున్న వైయస్సార్ సీపీ ప్రభుత్వానికి ప్రజలంతా మద్దతుగా నిలవాలని,మరొకసారి రానున్న ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వదించి గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సెగ్గే సూరిబాబు,ఎంపీటీసీ కమతం అర్జమ్మ, బీసీ డైరెక్టర్ గాడి నాగమణి,నాయకులు కాళ్ళ వనుంబాబు,పాటి శేఖర్,బకులూరు సర్పంచ్ శ్రీను,సుర్ల లోవరాజు, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు ధోని బాబ్జి,శేఖర్,గంగరాజు చెల్లారావు,రమణ,లక్ష్మణరావు,దేముడు, సన్యాసిరావు,కంటారం సూపర్ సర్పంచ్ రమణ,స్వామి,సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు,కన్వీనర్లు,గృహ సారథులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.