Breaking News

ప్రజా శ్రేయస్సే ద్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన జరుగుతుంది- మండల వైసీపీ నేతలు.

0 52

అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం కొయ్యూరు మండలంలోని బకులూరు సచివాలయంలో వై ఏపీ నీడ్స్ జగన్ అలాగే పల్లెనిద్ర కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీపీ బడుగు రమేష్,మండల పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు,మండల జేసీఎస్ కన్వీనర్ బండి సుధాకర్,జిల్లా కార్యదర్శి గాడి సత్తిబాబు,సర్పంచ్ శ్రీను హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సే ద్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగుతోందని,ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందని,తద్వారా ప్రజలు ఆర్థికంగా కూడా నిలదొక్కుకోవడానికి ఆస్కారం ఉంటుందని,ఎక్కడా అవినీతి లేని పాలన జరుగుతుందని అన్నారు.

సచివాలయం పరిధిలో ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో ప్రజలకు అందిన లబ్ధి గురించి ఎంపీపీ వివరించారు.ప్రజలకు అనేక రకాలుగా మంచి చేస్తున్న వైయస్సార్ సీపీ ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు ఎల్లప్పుడూ ఉండాలని ప్రజలను కోరారు.అనంతరం ప్రజలకు అందిన లబ్ధి యొక్క బోర్టును డిస్ప్లే చేసి,పార్టీ జెండా ఆవిష్కరణ చేసారు.ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్ కుమారి,సచివాలయం కన్వీనర్లు,గృహ సారథులు,వాలంటీర్లు,బకులూరు పంచాయితీ పెద్దలు దేముడు,కూడా చిన్నయ్య,వెంకన్న తాత,గోవింద్,బంటు బుజ్జి,కాళ్ళ వనుంబాబు,వేమల రమణమూర్తి,పెయ్యల రాజుబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.