అల్లూరి సీతారామరాజు జిల్లా: కొయ్యూరు మండలంలోని సూరేంద్రపాలెం గ్రామ శివారులలో నాటుసారా తయారు చేసి,విక్రయాలు చేస్తున్న ముగ్గురు మహిళలను వేర్వేరుగా అరెస్టు చేశామని ఎస్సై రాజారావు తెలిపారు.
తమకు ముందుగా అందిన సమాచారం మేరకు,తమ సిబ్బంది,మహిళా పోలీసులతో కలిసి దాడులు నిర్వహించగా వేర్వేరు చోట్ల 10 లీటర్ల నాటుసారాతో అంబటి గంగమ్మ అనే మహిళ,మరో 10 లీటర్ల నాటుసారాతో సాగిన దేవి,అరిమెల ఆదిలక్ష్మి అనే మరో ఇద్దరు మహిళలు పట్టుబడ్డారని చెప్పారు.ఈమేరకు వారి వద్ద నుంచి నాటుసారా స్వాధీనం చేసుకుని,ముగ్గురు మహిళలను అరెస్టు చేసి, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు.ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఐ ఆర్ఎస్ కే బాజీలాల్ ఆధ్వర్యంలో మండలంలో నాటుసారా నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టామని ఎస్సై చెప్పారు. ఎవరైనా నాటుసారా తయారీ,క్రయ విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.