Breaking News

నష్టపోయిన ప్రతీ రైతు కుటుంబానికి పంట భీమా అందేలా చర్యలు తీసుకుంటాం:ఏపీ ట్రైకార్ చైర్మన్ బుల్లిబాబు

0 46

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు మండలానికి చెందిన డి.గొందూరు పంచాయతీ పరిధిలోని సూకురుపుట్టు గ్రామంలో మిచౌంగ్ తుఫానుకు పంట నీట మునిగిన పంట పొలాల్లో పర్యటించి,రైతులను పరామర్శించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ శతక బుల్లిబాబు.
ఈ పర్యటనలో భాగంగా మిచౌంగ్ తుఫాను కారణంగా నష్టపోయిన బాధిత రైతుల పంట పొలాలను చైర్మన్ పరిశీలించారు.రైతులను ఓదార్చి ఆదుకుంటామని ధైర్యం చెప్పారు.నష్టపోయిన ప్రతీ రైతుకు పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారాన్ని పంట భీమా ద్వారా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తడిచిన ధాన్యాన్ని ఆర్బీకె ల ద్వారా కూడా కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.రైతులు అధైర్య పడొద్దని,ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఆయన ధైర్యం చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.