ఈనెల 25 నుండి 30 వరకు చింతాలమ్మ తల్లి జాతర ఉత్సవాలు.
అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం: రావణా పల్లి, చింతలపూడి గ్రామాలకు మధ్యనున్న ఘాట్ రోడ్ లో వెలసిన చింతాలమ్మ తల్లి జాతర మహోత్సవాలను ఈనెల 25 నుండి 30 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొయ్యూరు,కృష్ణాదేవిపేట గ్రామాల చింతాలమ్మ తల్లి మోటార్ యూనియన్ ప్రతినిధుల ఆధ్వర్యంలో 25న అమ్మవారి ఘటాల ఊరేగింపుతో ఉత్సవాలను ప్రారంభించనున్నట్లు మోటార్ యూనియన్ ప్రతినిధులు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. రావణాపల్లి, చింతలపూడి తదితర పలు పంచాయతీల పెద్దల సహకారంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు.