ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలపై రుణాలు ఇవ్వండి.
నర్సీపట్నం బ్రాంచ్ మేనేజర్ కి పీఎసీఎస్ చైర్మన్ సుమర్ల సూరిబాబు వినతి.
ఆర్ధికంగా వెనుకబడి ఉన్న గిరిజనులను ఆదుకోండి-పీఎసీఎస్ చైర్మన్ సూరిబాబు.
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలపై తక్షణమే రుణాలు ఇప్పించాలని నర్సీపట్నం బ్రాంచ్ మేనేజర్ ఎస్.కె. నాయుడు ని సోమవారం పిఎసిఎస్ చైర్మన్ సుమర్ల సూరిబాబు కలిసి వినతి పత్రాన్ని అందజేసారు.అన్ని రకాలుగా వెనుకబడి ఉన్న గిరిజనులను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. ఈ విధంగా చేయుట వలన సొసైటీ మరింత అభివృద్ధి చెందుతుందని కొయ్యూరు పిఎసిఎస్ చైర్మన్ సుమర్ల సూరిబాబు అన్నారు.