అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: అరకు పార్లమెంటు సభ్యురాలు గొడ్డేటి మాధవి ఆదేశాల మేరకు రేపు 5వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీ నిధుల (MPLADS) నుండి కొనుగోలు చేయబడిన స్ట్రీట్ లైట్స్,డస్ట్ బిన్స్ పంపిణీ చేయడం జరుగుతుందని,కావున గ్రామపంచాయతీ సర్పంచులు,ఎంపీటీసీ సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని ఎంపీడీఓ లాలం సీతయ్య తెలిపారు.