Breaking News

రావణాపల్లిలో ‘ఏపీ కి జగనే ఎందుకు కావాలి’ కార్యక్రమం.

0 62

‘ఏపీ కి జగనే ఎందుకు కావాలి’ అనే కార్యక్రమం ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం రావణాపల్లి సచివాలయంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీపీ బడుగు రమేష్, మండల పార్టీ అధ్యక్షులు జల్లి బాబులు, చింతపల్లి ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ,జేసీఎస్ కన్వీనర్ బండి సుధాకర్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మంచి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు.గత టీడీపీ హయాంలో ప్రతీ పంచాయితీలో జన్మభూమి కమిటీలు పెట్టి.. ఎవరికైనా పెన్షన్ కావాలంటే వాళ్ళే సంతకాలు పెట్టాలి.మొదటి సారిగా వచ్చే పెన్షన్ లో జన్మభూమి కమిటీలో ఉన్న వారికే కొంత సొమ్ము తీసుకొనే వాళ్ళని ఎంపీపీ అన్నారు.

ప్రతీ ఒక్కరికి మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా ఉండేందుకు వాలంటీర్ వ్యవస్థను,సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగిందని ఎంపీపీ ప్రజలకు తెలిపారు.ప్రతీ విషయంలో ప్రజలకు అనేక రకాలుగా మంచి చేస్తూ..ప్రజల సంక్షేమం కోసం మాత్రమే ఆలోచిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ని ప్రజలంతా ఆశీర్వదించాలని ఎంపీపీ కోరారు. సచివాలయం పరిధిలో ప్రజలకు అందిన సంక్షేమ పథకాలు గురించి వివరించి,ఆ పథకాలకు సంబంధించిన బోర్డు డిస్ప్లే చేయడం జరిగింది.అనంతరం వైసీపీ పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నల్లగొండ సర్పంచ్ జంపా రాజకుమారి, ఏఎంసీ డైరెక్టర్ అచ్యుత్,వార్డు మెంబర్లు గొట్టిపల్లి లక్ష్మి,రాజేశ్వరి,రావణాపల్లి మాజీ వైస్ సర్పంచ్ జంపా రాంబాబు, నల్లగొండ మాజీ వైస్ సర్పంచ్ పల్లి చిన్నబ్బాయి, పంచాయితీ నాయకులు పాడి మల్లయ్య,కన్వీనర్లు,గృహసారథులు, నాయకులు,కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.