Breaking News

ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వం..వైయస్సార్ సీపీ ప్రభుత్వం -పాడేరు ఎమ్మెల్యే.

0 143

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లోని బెన్నవరం పంచాయితీలో గురువారం’ఏపీ కి జగనే ఎందుకు కావాలి’అనే కార్యక్రమంలో పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వైయస్సార్ సీపీ జెండా ఆవిష్కరణ చేసి,ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో ప్రజలకు అందిన లబ్ది యొక్క వివరాలకు సంబంధించిన బోర్డు డిస్ప్లే చేశారు.అనంతరం ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. మునుపెన్నడూ లేని విధంగా ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మంచి చేస్తుంటే చూసి ఓర్వలేని కొన్ని ప్రతిపక్షాలు కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆమె ప్రతిపక్షాలపై మండిపడ్డారు.
వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మంచి చేయరు, మంచి చేస్తున్న వాళ్లను చూసి ఓర్వలేరు అని చురకలు అంటించారు. ఏ ప్రభుత్వం హయాంలో ప్రజలకు మంచి జరిగిందో,జరుగుతుందో ప్రజలంతా గమనిస్తున్నారని, ఎవరో వచ్చి తప్పుడు ప్రచారాలు చేస్తే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని ఆమె అన్నారు. ప్రజలకు మంచి చేస్తున్న వైయస్సార్ సీపీ ప్రభుత్వంపై ప్రజల మద్దతు ఎప్పటికీ ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. కల్లబొల్లి మాటలు చెప్పి,తప్పుడు ప్రచారాలు చేసి ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని, ప్రజల సంక్షేమం, అభివృద్ధి దిశగా మాత్రమే అడుగులు వేస్తున్న వైయస్సార్ సిపి ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా తూచా తప్పకుండా పాటిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. అలాగే పెన్షన్ దారులకు జనవరి నుండి పెన్షన్ కూడా 3000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఇలా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఆమె ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మోరి రవి, ఎంపీపీ అనూషాదేవి,జడ్పీటీసీ పోతురాజు బాలయ్య,సర్పంచుల పోరం అధ్యక్షురాలు దురియా పుష్పలత.స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ మీరా, ఎంపీటీసీ పద్మ,కో ఆప్షన్ సభ్యులు నాజర్వల్లి,సచివాలయ కన్వీనర్లు బచ్చల రమణమ్మ,వినోద్,బచ్చల బొజ్జన్నదొర,ఉప సర్పంచ్ నాగేశ్వరావు, వార్డు మెంబర్లు పాలికి గోవింద్,కేశవరావు,గృహ సారథులు నూకరాజు, అప్పారావు,భగత్ రామ్,సత్తిబాబు, బాలకృష్ణ,సీతారామ్,జోసెఫ్, శ్రీను, సతీష్,లక్ష్మణ్,బొంజుబాబు,రాజు కుమార్,రమేష్,రాజేశ్వరి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.