Breaking News

కొయ్యూరు: ఎదురెదురుగా వస్తూ రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.

0 20

 ఎదురెదురుగా వస్తూ రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.

ఇద్దరికి తీవ్ర గాయాలు, ముగ్గురికి కొద్దిపాటి గాయాలు.

మద్యం సేవించి ఉండటం,మితిమీరిన వేగమే యాక్షిడెంట్ కి కారణమని పలువురు అంటున్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం:

కొయ్యూరు గ్రామం దాటిన వెంటనే మండలం లోని మంప గ్రామానికి చెందిన అల్లు శివ,గాడి కుమార్ రాజా,దాసరి బాబీ అను వారు,తుమ్మలబంధ గ్రామానికి చెందిన ఉల్లి గంగులు దంపతులు అను వారు.. రెండు ద్విచక్ర వాహన దారులు  ఎదురెదురుగా వస్తూ హొండా బైకును,రాయల్ ఇన్ఫీల్డ్ వాహనం బలంగా ఢీ కొనడం జరిగిందని పలువురు తెలిపారు.రాయల్ ఇన్ఫీల్డ్ బైక్.. హోండా బైక్ ను ఢీ కొన్న వెంటనే రొడ్డుపక్కనే ఉన్న పొలంలో భార్య భర్తలు ఇద్దరు ఎగిరి పడ్డారని అన్నారు.హోండా బైక్ పై వెళుతున్న ఇద్దరి వ్యక్తులకు తీవ్ర గాయాలు,రాయల్ ఇన్ ఫీల్డ్ బైక్ పై వెళుతున్న ముగ్గురు వ్యక్తులకు కొద్దిపాటి గాయాలు అయ్యాయి.అయితే ఈ యాక్షిడెంట్ కి మద్యం సేవించి ఉండటం, మితిమీరిన వేగమే కారణమని పలువురు తెలిపారు.క్షత గాత్రులను వెంటనే రాజేంద్ర పాలెం పీహెచ్ సీ కి తరలించారు.

Leave A Reply

Your email address will not be published.