Breaking News

రావణాపల్లి పంచాయితీలో ఆధార్ సేవలు.

0 58

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: ఎంపీడీఓ లాలం సీతయ్య ఆదేశాల మేరకు రావణాపల్లి పంచాయితీలో మూడు రోజులు పాటు ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటు చేసినట్లు రావణాపల్లి పంచాయితీ కార్యదర్శి రజని తెలిపారు.

ఆధార్ అప్డేట్,జిల్లా మార్పు,ఫోన్ నెంబర్ లింకప్,పేరులో తప్పులుంటే మార్పు చేసుకోవడం,చిన్న పిల్లలకు ఆధార్ కార్డు నమోదు వంటివి చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు.కనుక రావాణాపల్లి పంచాయితీ ప్రజలు ఆధార్ సేవలు వినియోగించుకోవాలని ఆమె తెలిపారు.ఈ మేరకు ఆధార్ సేవలు పంచాయితీలో ప్రజల వద్దకు అందుబాటులోకి తీసుకురావడం పట్ల పంచాయితీ సర్పంచ్ కాకురు లక్ష్మి,పంచాయితీ ప్రజలు ఎంపీడీఓ కి కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.