Breaking News

గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి నిరంతర కృషి- పాడేరు ఎమ్మెల్యే

0 46

*గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి నిరంతర కృషి.

*అభివృద్ధి జగన్ తోనే సాధ్యం
-పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి.

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: పాడేరు నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో తాగునీటి సమస్యను గిరిజనులు ఎదుర్కొంటున్నారని ఆ సమస్య పరిష్కారానికి అధికారులు,తాను నిరంతరం కృషి చేస్తున్నామని ఒక్కొక్క గ్రామానికి ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ లో భాగంగా తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామని పాడేరు శాసనసభ్యులు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి వెల్లడించారు.
కొయ్యూరు మండలం మర్రివాడ గ్రామంలో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించిన 20వేల లీటర్ల సామర్థ్యం గల రక్షిత మంచినీటి ట్యాంకును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఈ గ్రామానికి అనేకసార్లు వచ్చినప్పుడు తాగునీటి సమస్యపై ప్రధానంగా గ్రామస్తుల తనకు విన్నవించారని తెలిపారు. ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ లో పరిష్కారం చూపడం జరిగిందని పేర్కొన్నారు. 20వేల లీటర్ల రక్షిత తాగునీటి ట్యాంక్ నిర్మాణం చేసుకొని 112 ఇంటి కుళాయిలు ఏర్పాటు ద్వారా రక్షిత మంచినీటిని పంపిణీకి శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ ట్యాంక్ ను ఏర్పాటు తర్వాత ఇది మన వస్తువుగా భావించాలని ప్రభుత్వమే మనం.. మనమే ప్రభుత్వం అన్నట్టుగా ఉన్నప్పుడే ఎక్కువ కాలం అవి ఉండగలుగుతాయని పేర్కొన్నారు. అన్ని ఇళ్ళకు తాగునీటి కనెక్షన్ ఇవ్వడం జరిగిందని వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామస్తులదేనని చెప్పారు.ఎన్ ఆర్ ఈ జీ ఎస్ లో రహదారి నిర్మాణం చేసుకున్నామని ఈ పంచాయతీ పరిధిలో ఒక గ్రామం తప్ప అన్ని గ్రామాల్లో గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించామని పేర్కొన్నారు. మరో నలభై లక్షలు గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమం కింద నిధులు విడుదల కానున్నాయని అందరూ ఎక్కడైతే అనుకున్నారో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అభివృద్ధి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి పునరుద్ఘాటించారు. “మీ అందరికీ ఏ నాయకులైతే అందుబాటులో ఉంటున్నారు ఏ నాయకులయితే మీకు మంచి చేస్తున్నారో మనస్సాక్షిని అడిగి 2024లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి ని ఆశీర్వదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ వంతల లక్ష్మి,ఎంపీపీ బడుగు రమేష్, జడ్పిటిసి వారా నూకరాజు,వైస్ ఎంపీపీలు అప్పన్న వెంకటరమణ, అంబటి నూకాలమ్మ,పార్టీ మండల అధ్యక్షులు జల్లి బాబులు,ఏఎంసీ చైర్మన్ జైతి రాజులమ్మ,మండల కన్వీనర్ బండి సుధాకర్,ట్రైకార్ డైరెక్టర్ సుమర్ల సరస్వతి,కొయ్యూరు కో-ఆపరేటివ్ చైర్మన్ సుమ్మర్ల సూరిబాబు, వైఎస్ఆర్సిపి నాయకులు గాడి సత్యనారాయణ,పొత్తూరు తాతారావు, జోరంగి రామారావు,గాడి అచ్చిరాజు,పాటి శేఖర్,లాలం శేఖర్,నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.