Breaking News

అరకు ఎంపీ ఆదేశాల మేరకు గిరిజన విద్యార్థులకు లంచ్ బాక్సులు పంపిణీ చేసిన ‘నేనుసైతం’ శివప్రసాద్.

0 24


అనకాపల్లి జిల్లా,నర్సీపట్నం: ఈరోజు నర్సీపట్నం పట్టణం నందు ఉన్న ఎస్టి హాస్టల్-2 లో ఉంటూ పట్టణ పరిధిలో చదువుకుంటున్న 100 మంది పేద గిరిజన విద్యార్థులు మధ్యాహ్న భోజనం కాలేజీలకు తీసుకెళ్లడానికి లంచ్ బాక్స్ లు లేక ఇబ్బంది పడుతున్నారని విద్యార్థులందరికీ లంచ్ బాక్సులు అందించాలని స్థానిక హాస్టల్ వార్డెన్ టి.మల్లేష్ అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ని కోరగా,స్పందించిన ఎంపీ విషయాన్ని ‘నేనుసైతం’ చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివప్రసాద్ కి తెలిపిన వెంటనే,హుటాహుటిన గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహం-2 కు చేరుకుని,ఎంపీ ఆదేశాల మేరకు లంచ్ బాక్సులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా లంచ్ బాక్సులు పంపిణీ చేసినందుకు అరకు ఎంపీ గొడ్డేటి మాధవి శివప్రసాద్ దంపతులకు ఉపాధ్యాయులు,విద్యార్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం శివప్రసాద్ కి దుస్సాల్వతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేనుసైతం చారిటబుల్ ఫౌండేషన్ డైరెక్టర్లు కొరుప్రోలు పృథ్వీరాజ్,లోకేష్,హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు తిరుపతిబాబు,హరిదేవ్,లక్ష్మయ్య,సత్యనారాయణ,ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.