Breaking News

అరకు ఎంపీ కి కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ ఉపాధ్యాయులు వినతి.

0 38

విశాఖపట్నం: ఈరోజు అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ని విశాఖపట్నం ఎంవిపి సర్కిల్,సెక్టర్ 12 లో ఉన్న ఎంపీ పార్టీ కార్యాలయంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ ఉపాధ్యాయులు మర్యాదపూర్వకంగా భేటీ అవ్వడం జరిగింది.

ఈ సమావేశంలో వారు ఎంపీ తో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 579 మంది సిఆర్టీ లను రెగ్యులర్ చేసేందుకు అర్హులు ఉన్నారని పేర్కొని అందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటిడిఏ పరిధిలో 259 మంది అర్హులున్నారని తెలిపి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎంపి స్పందిస్తూ.. ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఈ సమస్యను పరిష్కరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.