Breaking News

తాటాకు ఇల్లులు దగ్ధమై నిరాశ్రయులైన కుటుంబాలకు అండగా నిలిచిన నేనుసైతం శివప్రసాద్.

0 19

తాటాకు ఇల్లులు దగ్ధమై నిరాశ్రయులైన తాటిమానుపాలెం గ్రామస్తులకు అండగా నిలిచిన నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివప్రసాద్.

ఇటీవల సుమారుగా రెండు నెలల క్రితం అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం అంతాడ పంచాయితీ లోని తాటిమానుపాలెం గ్రామంలో నాలుగు ఇల్లులు దగ్ధమై ఏడు కుటుంబాలు వీధిన పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న అరకు ఎంపీ గొడ్డేటి మాధవి భర్త అయిన నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివప్రసాద్ నేరుగా ఆ గ్రామానికి వెళ్ళి ఆ కుటుంబాలకు రేకుల ఇల్లులు నిర్మిస్తానని హామీ ఇచ్చారు.చెప్పినట్టుగానే  2లక్షల రూపాయలుతో రేకుల ఇల్లులు నిర్మాణం చేయడం జరుగుతుంది.ఈరోజు శివప్రసాద్ తాటిమానుపాలెం గ్రామాన్ని సందర్శించి ఇల్లుల నిర్మాణం ఎలా జరుగుతుందో పరిశీలించారు.రేకుల ఇల్లులు నిర్మిస్తున్న స్థలం వద్ద ఒక బోర్ వెల్ కూడా కావాలని వారు కోరారు.వెంటనే స్పందించిన శివప్రసాద్ బోర్ వెల్ కూడా తన సొంత డబ్బుతో కొట్టిస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా శివ ప్రసాద్ మాట్లాడుతూ తాను రేకుల ఇల్లులు నిర్మిస్తానని హామీ ఇచ్చినప్పటి నుండి తనకు ప్రతీ సందర్భంలోనూ వెనుక సపోర్ట్ గా ఉన్న స్థానిక సర్పంచ్ చంద్రరావు కి అభినందనలు తెలిపారు.అలాగే నిరాశ్రయులైన కుటుంబీకులు మాట్లాడుతూ ఇచ్చిన హామీ ప్రకారం వారికి రేకుల ఇల్లులు నిర్మిస్తున్న నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివప్రసాద్ కి ఎప్పుడూ ఋణపడి ఉంటామని, ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.