Breaking News

సచివాలయం సిబ్బంది సమయానికి హాజరు కాకపోతే జీతాలు కట్: జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

0 64

అల్లూరి సీతారామరాజు జిల్లా,పాడేరు: సచివాలయం సిబ్బంది సమయానికి సచివాలయాలకు హాజరు కాకపోతే జీతాలు కట్ చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుండి ఎంపిడిఓలు,ఉపాధి హామీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఉపాధి హామీ పనులు, సచివాలయం సిబ్బంది హాజరు, జనన దృవీకరణపత్రాలు జారీ, ఆధార్ శిబిరాలు నిర్వహణ, ఆస్తిపన్నులు సేకరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పంచాయతీ అధికారి,డి ఎల్ డి ఓలు, గ్రామ సచివాలయాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. ప్రతీ మండలంలోను రోజుకి ఐదు వేల మందికి ఉపాధి పనులు కల్పించాలని సూచించారు. ఉపాధి కూలీల ఆధార్ సీడింగ్, ఆధార్ అథెంటికేషన్ చేయాలని స్పష్టం చేసారు. ఉపాధి పనులు లక్ష్యాలు సాధించని ఎపిఓ ల పని మెరుగు పడాలని, ఉపాధి పనులు కల్పనలో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించనని హెచ్చరించారు. నీటి సంరక్షణ,భూ సార సంరక్షణ పనులు చేయాలని చెప్పారు. ఫారం పాండ్స్,కాలువల పనులు గుర్తించి ఉపాధిపనులు చేయాలని పేర్కొన్నారు. తొలగించిన ఉపాధి హామీ కార్డులను పునరుద్దరించాలని ఆదేశించారు. వి ఆర్ ఓలు సక్రమంగా విధులకు హాజరు కాకపోయినా, క్షేత్ర స్థాయి పర్యటనలో లేకపోయినా జీతాలు నిలుపుదల చేయాలని చెప్పారు. ఎనర్జీ అసిస్టెంట్లు విధిగా సచివాలయాలకు హాజరు కావాలని స్పష్టం చేసారు.
వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా పంచాయితీ అధికారి కొండలరావు,డివిజనల్ పంచాయతీ అధికారి పి.ఎస్.కుమార్, డి ఎల్ డి ఓ శాంత కుమారి, ఉపాధి హామీ డిబిటి మేనేజర్ నరేష్,ఉపాధిహామీ ఎపిడి జె.గిరిబాబు, జి ఎన్ డబ్ల్యూ ఎస్ జిల్లా కో ఆర్డినేటర్ సునీల్, 22 మండలాల ఎంపిడి ఓలు, ఎపిఓలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.