అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలం: ఈరోజు సోలాబు నుండి కాకరపాడు మీదుగా AP31TG 3010 అను నెంబరు గల ఆటోలో 18 వేల రూపాయలు విలువచేసే ఎనిమిది గన్నెర ముక్కలను అక్రమంగా తరలిస్తుండడంతో ముందస్తుగా విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు గన్నెర ముక్కలు లోడుతో వస్తున్న ఆటోను పట్టుకుని స్వాధీనం చేసుకోవడం జరిగింది.ఈ కలప యజమాని గొలుగొండ మండలం పాత కృష్ణాదేవిపేట కు చెందిన అప్పికొండ రాజు అనే వ్యక్తి దని,ఆటో కూడా అదే గ్రామానికి చెందిన చిన్న అనే వ్యక్తి దని అటవీ శాఖ అధికారులు తెలిపారు.సెక్షన్ ఆఫీసర్ సింహాద్రి, బీట్ ఆఫీసర్ లు రాకేష్ కుమార్,రాజకుమార్ అలాగే బేస్ క్యాంప్ కన్నయ్య కలిసి ఆటోను పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు.